టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కచ్చితంగా గెలిచి తీరాలని బాగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన ఒకే ఒక తప్పు అతను సీఎం అయ్యే ఛాన్సెస్ ను దాదాపు సున్నా కి తగ్గించేసింది అని తెలుస్తోంది. ప్రస్తుత ఏపీ సీఎం జగన్ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు పెన్షన్ కూడా ఇంటికి తీసుకొచ్చి అందించే ఈ సర్వీస్ చాలామంది ప్రజలకు బాగా నచ్చేసింది అయితే చంద్రబాబుకు కింద ఎమ్మెల్యేలు ఇవ్వాలంటే వ్యవస్థ వల్లే మనం గెలిచే అవకాశాలు తగ్గుతున్నాయని చెప్పారట.

ఈ పథకాలను తీసుకెళ్లి ప్రజలకు అందించే వాలంటీర్లు జగన్కు మాత్రమే ఓటేయాలని లేదంటే ఈ పథకాలు ఏవి రావని ప్రజలను భయపెడుతున్నారని టిడిపి నేతలు అభిప్రాయపడ్డారు అదే చంద్రబాబు చెవిలో వేశారు వారి కారణంగా ప్రజల్లో జగన్ కి మాత్రమే ఓటు వేయాలని భయం పట్టుకుంటుందని చంద్రబాబు పొరపాటు పడ్డారు. అందుకే వాలంటీర్ వ్యవస్థను బంద్ చేయించారు ఎన్నికల సంఘంతో పేజీ పెట్టుకుని మరి ఈ సిస్టంకు బ్రేకులు వేయించారు. అయితే దీనివల్ల ప్రజల్లో చంద్రబాబు పట్ల మరింత వ్యతిరేకత వచ్చింది. పెన్షన్ల కోసం వృద్ధులు బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేషన్ కోసం కూడా షాపులకు వెళ్లాల్సి వస్తోంది. వారందరూ టీడీపీ కారణంగానే ఈ దుస్థితి వచ్చిందని చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాబు వస్తే ఇక వాలంటీర్ సర్వీస్ అసలే ఉండదనే అభిప్రాయ ప్రజల్లో ఏర్పడింది. దీనివల్ల ఇబ్బంది ఎదురవుతాయి కాబట్టి జగన్ మాత్రమే సీఎం గా ఎంచుకోవాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలందరికీ కావాల్సిన వాలంటీర్ వ్యవస్థను ఆపితే తమకే మైనస్ అనే లాజిక్ ని చంద్రబాబు బాగా మిస్ అయ్యారు. అదే అతని ఓటమిని శాసిస్తుందని చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థ విషయంలో చాలానే తప్పులు చేశారు. ఆయన ప్రసంగాల్లో కూడా దీనిని తీసేస్తున్నట్లు మాట్లాడారు. ఒకవేళ వాలంటీర్లు జగన్‌కు మద్దతుగా ప్రచారం చేస్తారని, వారి వల్లే ఓటమి తద్యమని చంద్రబాబు నమ్మటం నిజంగా పెద్ద పొరపాటు అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: