ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలలో ఎన్నికల వేడి రోజుకీ పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా కడప జిల్లాలో ప్రొద్దుటూరు నియోజకవర్గం లో గురు శిష్యుల మధ్య పోటీ అందరిని ఆసక్తి కలిగించేలా చేస్తుంది. ముఖ్యంగా నంద్యాల వరదరాజుల రెడ్డి కడప జిల్లాలో మంచి పేరున్న నేత ..ప్రస్తుతం ఆయన వయసు 82 సంవత్సరాలు.. ఈ వయసులో కూడా రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూ ఉన్నారు. యువ నేతలతో పోటీపడి మరి చురుకుగా ముందుకు వెళుతున్నారు ఎలాంటి మచ్చలేని వ్యక్తిత్వం కలిగిన నేత. మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సమకాలికుడని చెప్పవచ్చు.

.
అయితే రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఇతర నాయకుల మాదిరిగానే ఈయన కూడా వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. కొన్ని కార్యక్రమాలలో ప్రొద్దుటూరులో పాల్గొన్నప్పటికీ.. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి మాటలతో ఆయన మనస్థాపానికి గురి కావడం వల్ల వైఎస్ఆర్సిపి పార్టీ దగ్గరకు కూడా వెళ్లకపోవడానికి ముఖ్య కారణం అదే అని కూడా అక్కడి నేతలు.. ఆయన కార్యకర్తలు చెబుతూ ఉంటారు.


ప్రొద్దుటూరు నుంచి 1985లో వరదరాజు రెడ్డి నంద్యాల నుంచి మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలా 2009 వరకు ఐదు సార్లు ఎంపికయ్యారు. 2009 ఎన్నికలలో ఓడిపోవడం జరిగింది. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టిడిపి పార్టీలోకి చేరారు. 2014 ఎన్నికలలో రాజమల్లు శివప్రసాద్ రెడ్డి చేతిలో కూడా ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో అవకాశం రాలేదు.. మళ్లీ 2024లో టిడిపి పార్టీ నుంచి ముగ్గురు నేతలు పోటీపడ్డప్పటికీ వరదరాజు రెడ్డిని టిడిపి అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. అయితే అక్కడి నేతలలో పోటీ పడ్డవారిలో లింగారెడ్డి ప్రవీణ్ కుమార్ సహకారం ఈయనకు ఉండదనే వార్తలు వినిపిస్తున్నాయి.

వరదరాజు రెడ్డి పైన ఇప్పటివరకు ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడమే ఈయనకు బాగా కలిసొస్తుంది. అలాగే ఈయన సీనియారిటీ ఉండడం చేత ప్రజల చెంతకు చేరడానికి మరింత అవకాశం ఉన్నది. పార్టీ శ్రేణులలో ఎవరికైనా ఇబ్బందులు వస్తే ఖచ్చితంగా వెళ్తారట. ఎవరినైనా ఎదిరించే తత్వం కలదు వరదరాజు రెడ్డికి.

నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పైన ఇప్పటికే ప్రచారంలో భాగంగా ఎన్నోసార్లు ఘాటుగా హెచ్చరిస్తూనే ఉన్నారు... 2014లో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేసిన శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. 2019లో కూడా మళ్లీ శివ ప్రసాద్ రెడ్డి పోటీ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. అయితే ఈయన పైన ఎన్నో అవినీతి ఆరోపణలు వినిపించాయి. ఇదే కాకుండా ఈయన బంధువులు ఆగడాలు.. ఇసుక మాఫియా అనుచరులు శివ ప్రసాద్ రెడ్డి బామ్మర్ది పెత్తనం వంటివి వైసిపి ఓటు బ్యాంకు పైన తీవ్ర ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయట. ఈ వార్తల పైన ఆయన దీటుగానే స్పందిస్తూ తన పైన ఆరోపనలు అన్నీ వట్టి మాటలేనని.. వారిలో వారికే సఖ్యత లేదు.. నన్నేం చేయగలరు అంటూ టిడిపి ప్రొద్దుటూరు నేతలను హెచ్చరిస్తున్నారు.



ఇటీవల తన కుమార్తె ఒక దళిత యువకుడిని ప్రేమించడంతో కూతురు వివాహం ఏమాత్రం సంకోచించకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి మరి అక్కడ వివాహాన్ని జరిపించారు ..ఈ పేరుతో బాగా పాపులర్ అయ్యారు.. దీంతో చాలామంది ఈయనకు అన్ని వర్గాలు వారు హ్యాట్సాఫ్ చెప్పారు.. ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీలు,  దళితులు, ముస్లిం ఓటర్లు కూడా ఈయన చేసిన పనికి హర్షం తెలియజేశారు. నంద్యాల వరదరాజు రెడ్డి శిష్యుడే ప్రొద్దుటూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అని తెలుస్తోంది.. మరి గురు శిష్యుల మధ్య పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: