వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ క్యాన్సిల్ చేయడం గురించి ఒక పిటీషన్ ఇటీవల దాఖలైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ పిటిషన్ పై వాదనలు ముగిసాయి. వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో ఒక దావా ఫైల్ చేశారు. ఈ పిటిషన్‌ను వివేకానంద హత్య కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి ఫైల్ చేశాడు. అవినాష్ రెడ్డి అధికారాన్ని ఉపయోగించుకుంటూ అబద్ధపు సాక్ష్యం చెప్పాలని తనను ఫోర్స్ చేస్తున్నట్లు దస్తగిరి సీబీఐ ముందు వాపోయాడట. అంతేకాదు తన కుటుంబ సభ్యులపై అవినాష్ అనుచర గణం దాడులు చేస్తున్నట్లు కూడా అతను ఆరోపించాడు.

న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ఈ పిటిషన్ పై వాదనలు వినిపించారు. తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దును క్యాన్సిల్ చేయాలని ఆయన కోర్టు ఎదుట కోరుకున్నారు. అవినాష్ రెడ్డి తన అన్న జగన్ సహాయంతో బాధితులను బెదిరిస్తున్నారని కూడా ఆరోపణలు చేశారు. అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే బాధితులకు న్యాయం జరగదని కూడా అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ జైలు పోలీస్ అధికారులు అందరూ కలిసి సాక్షాలను తారుమారు చేస్తున్నారని కూడా న్యాయవాది సంచలన అలిగేషన్స్ చేశారు. తక్షణమే బెయిల్ మంజూరును రద్దు చేయకపోతే బాధితులకు ఎప్పటికీ న్యాయం చేయకూడదని కూడా వాదించారు. సాక్షాలను చేంజ్ చేయడానికి ప్రయత్నించినట్లు చెప్పడానికి తగిన ఆధారాలు ఉన్నాయని సీబీఐకి చెప్పారు. సిబిఐ కూడా అవినాష్ బెయిల్ రద్దు చేయాలని కోరింది. అందరి వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇందులోనే అవినాష్ భవిష్యత్తు దాగి ఉంది.

ఇదిలా ఉండగా వైఎస్ వివేకానంద హత్య కేసు ఎప్పటికీ వీడడం లేదు. ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనే ప్రశ్నలకు త్వరగా సమాధానాలు కనిపెట్టాలని అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ ఇప్పటివరకైతే పెద్దగా పురోగతి కనిపించలేదు. చివరికి ఈ కేసులో ఎవరు దోషులుగా తేలతారో చూడాలి. అన్ని పార్టీల నేతలు, ప్రజలు కూడా ఈ కేసు పట్ల చాలా ఆసక్తిని చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: