పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల ప్రసంగాల్లో జగన్‌ను టార్గెట్ చేస్తున్నారు. జగన్ వ్యక్తిగత విమర్శలు చేయడంపై పవన్ మండిపడుతున్నారు. సంస్కారం లేని వారే కుటుంబాలపై మాట్లాడతారని అంటున్నారు. ఇచ్చిన ప్రతి హామీకి జవాబుదారీ తనంగా ఉంటామంటున్న పవన్‌ కల్యాణ్‌.. వాటిని అమలు చేసే బాధ్యత జనసేన తీసుకుంటుందని.. పథకాల నిధులు దారి మల్లించబోమని.. అంటున్నారు.


నిన్న భీమవరంలో పర్యటించిన పవన్‌ కల్యాణ్‌.. అంజిబాబును గెలిపిస్తే భీమవరం డంపింగ్ యార్డు సమస్యకు పరిష్కారం చూపిస్తామని.. మంచినీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడి ఎంఎల్ఏ నియోజకవర్గానికి ఎన్నో హామీలు ఇచ్చాడని... ఒక్కటి కూడా నెరవేర్చలేదని.. జగన్ నువు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు కాబట్టి...అత్యధిక స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని స్థాపిస్తామని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. విద్యుత్ బిల్లులు సాకుగా చూపి జగన్‌ పింఛన్లు కోత విధించాడన్న పవన్‌ కల్యాణ్‌.. డ్వాక్రా మహిళలను కూడా జగన్ వంచించాడన్నారు.


గత ప్రభుత్వం పెట్టిన నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను మూసేసాడన్న పవన్‌ కల్యాణ్‌.. మీకు మాటిస్తున్నా.... దశాబ్ద కాలంగా పోరాడుతున్నా.. పారిపోయే వాడిని అయితే పార్టీ పెట్టే వాడిని కాదు.. రాష్ట్రం కోసం ఆలోచించి గత ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గంపై దృష్టి పెట్టలేకపోయా.. ఈ సారి భీమవరంలో పులపర్తి ఆంజనేయులును గెలిపించండని విజ్ఞప్తి చేశారు.

 
2047కి భారత్ సూపర్ పవర్ కావాలంటే యువతలో నైపుణ్యాలను వెలికి తీసుకువచ్చేల ప్రభుత్వాలు పనిచేయాలని.. యువతలోని నైపుణ్యాలను రూ. 5 వేలతో అణచివేస్తున్నారని.. కొన్ని రోజులుగా ఆరోగ్యం సహకరించకపోయినా ప్రజల కోసం తాను తపిస్తున్నానని.. 2014లో ఉమ్మడి జిల్లాలో 15కి 15 గెలిచాం... ఈ సారి కూడా అదే రిపీట్ అవ్వాలని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఒక్క వైకాపా అభ్యర్థికి కూడా డిపాజిట్లు రాకూడదన్న పవన్‌.. జగన్ లాంటి దుర్మార్గులకు అధికారం ఇవ్వకూడదన్నారు. ప్రభుత్వం మారబోతోందని.. ఏ ఒక్క పథకాన్ని తొలగించబోమని.. మరింత పెంచుతామని పవన్‌ కల్యాణ్‌ భరోసా ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: