పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడు, ఆత్మీయుడుగా గుర్తింపును సొంతం చేసుకున్న ఉదయ్ శ్రీనివాస్ ఈ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం కాకినాడలో టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడైన సానా సతీష్ చక్రం తిప్పుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. ఎన్నికల సమయంలో బింధుమాధవ్ తీరు ఒకింత వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.
లోకేశ్ కు సన్నిహిత అధికారిగా కూడా బిందు మాధవ్ కు పేరుంది. ప్రస్తుతం కాకినాడ జిల్లాకు సంబంధించి ఏ పనిలో అయినా జనసేనకు అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయని సమాచారం అందుతోంది. కాకినాడ ఎంపీ జోక్యం వల్ల స్థానికంగా టీడీపీ మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితి అయితే లేదని తెలుస్తోంది. ఎస్పీ బిందు మాధవ్ నియామకంతో ఈ పరిస్థితి మారుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
జనసేన ప్రాభవాన్ని తగ్గించే విధంగా టీడీపీ నేతలు అడుగులు వేస్తుండటం గమనార్హం. టీడీపీ నేతల భవిష్యత్తు వ్యూహాలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. ఏపీలో వైసీపీ నెమ్మదిగా డీలా పడుతుంటే టీడీపీ మాత్రం పుంజుకోవడం గమనార్హం. 2029లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయో లేక విడిగా పోటీ చేస్తాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఏపీలో సంక్షేమ పథకాల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేర్వేరు కారణాల వల్ల రాజకీయ పరిణాలు మాత్రం శరవేగంగా మారుతున్నాయని కచ్చితంగా చెప్పవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి