
అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కు మరో ఊహించని షాక్ ఇచ్చింది మోడీ ప్రభుత్వం. పహాల్గం ఉగ్రదాడి నేపథ్యంలో ఆర్థిక పరంగా పాకిస్తాన్ కు మరో షాక్ ఇచ్చేందుకు ఇండియా సిద్ధమైంది. ఆ పాకిస్తాన్ దేశాన్ని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రేట్ లిస్టులో పెట్టేందుకు వచ్చే నెల... లో సంప్రదింపులు చేయబోతోంది మోడీ ప్రభుత్వం. ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రయత్నాలు సక్సెస్ అయితే ఆర్థిక కార్యకలాపాలపై నిఘా పెరిగి పాకిస్తాన్ కు విదేశీ పెట్టుబడులు కూడా పూర్తిగా తగ్గిపోతాయని తెలుస్తోంది.
మరోవైపు పాకిస్తాన్ దేశానికి 59 వేల కోట్ల ఐఎంఎఫ్ నిధులను కూడా రాకుండా మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఒకవేళ ఇదే సక్సెస్ అయితే... పాకిస్తాన్కు ఆర్థికంగా తీవ్రమైన దెబ్బ పడనుంది. అయితే ఇండియా... ఇలా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో బార్డర్లో మాత్రం పాకిస్తాన్ తగ్గడం లేదు. ప్రతిరోజు బార్డర్లో కాల్పులు చేస్తోంది పాకిస్తాన్ ఆర్మీ. వరుసగా తొమ్మిదో రోజు కూడా కాల్పులు నిర్వహించింది. చైనా దేశం... కూడా పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇలా కుట్రలు పన్నుతోందని అంటున్నారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు