భారత్, పాకిస్తాన్ మధ్య జరిగింది ఇప్పటివరకు కేవలం ట్రైలర్ మాత్రమే మళ్లీ భారత్ జోలికి వస్తే అసలు సినిమా ఏంటో చూపిస్తాను అంటూ త్రివిధ దళాలు సైతం నిన్నటి రోజున స్పష్టం చేశాయి. ఆపరేషన్ సింధూర్ తో చేపట్టిన త్రివిధ దళాల సైతం భారత్ సైన్యం ఉగ్ర స్థావరాలను కూడా పూర్తిగా నేలమట్టం చేపట్టాయి. తొమ్మిది ఉగ్ర శిబిరాల స్థావరాలను కూడా ధ్వంసం చేశాయి. భారత్ దాడులు చేస్తున్న భయంతో పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలు కూడా పూర్తిగా ఖాళీ చేసి పారిపోయినట్లుగా తెలుస్తోంది.


సరిహద్దు అవతల ఉన్నటువంటి ఉగ్ర శిబిరాలను కూడా ఖచ్చితమైన ఆధారాలతో గుర్తించి మరి దాడులు చేసినట్లుగా తెలియజేస్తున్నది ఇండియన్ ఆర్మీ. అందుకు సంబంధించిన కొన్ని మ్యాప్ల ఫోటోలను కూడా విడుదల చేశారు. కానీ శత్రు దేశమైన పాకిస్తాన్ మాత్రం భారత్ పైన గగనతల దాడికి దిగింది. డ్రోన్లు మానవ రహిత విమానాలను సైతం భారత్ పైన ప్రయోగించిన వాటన్నిటిని కూడా రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారత్, పాకిస్తాన్ మూడు రోజుల దాడులు కొనసాగుతూ చేసిన యుద్ధంలో  పాకిస్తాన్ సైనికులు 40 మంది మరణించినట్లు అంచనా వేస్తున్నారు.. ఇక భారతదేశానికి చెందిన ఐదు మంది సైనికులు అమరులయ్యారని భారత సాయుధ దళాలు వెల్లడించాయి.

పాక్ పౌరులను లక్ష్యంగా చేసుకోకుండా  భారత్ ఎలాంటి దాడులు చేయలేదు.. కానీ పాకిస్థాన్ మాత్రం భారత్ నగరాలను అమాయకులను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతోంది. కానీ భారత సైన్యం కూడా గట్టిగానే వార్నింగ్ ఇస్తోంది. పాకిస్తాన్ ప్రతిపాదన మేరకే కాల్పుల విరమణ అంగీకరించినటువంటి భారత్.. మళ్లీ ఆదేశం మొదలుపెడితే ఈసారి మరింత ఎక్కువగా ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ పడి పడుతుందంటూ తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఇండియన్ ఆర్మీ వాయిసేన  అనుబంధం తో అరేబియా సముద్రంలో సిద్ధంగా ఉన్నదంటు తెలియజేస్తున్నారు. మరి ఈ రోజున ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: