
ఇదిగో పులి అదుగో పులి అంటూ రోజులు వారాలు నెలలు గడిచి పోతున్నాయి .. కానీ కాంగ్రెస్ పార్టీ నేతల ఎదురుచూపులు మాత్రం ఫలించడం లేదు .. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న సూచనలు గట్టిగా కనిపిస్తున్నాయి .. అలాగే పార్టీ కార్యవర్గానికి కూడా కలవనీయకుండా నెలల తరబడి ఎదురుచూసేలా చేయటం ఏమిటని .. కాంగ్రెస్ హై కమాండ్ అంత తీరిక లేకుండా ఉందా అన్న విమర్శలు కూడా సొంత పార్టీలోనే వస్తున్నాయి .. అధికారంలో ఉన్నప్పటికీ పదవుల్లో పోటీ ఎప్పుడు ఉంటుంది .. ఈ కారణంగా ఇలా వాయిదాలు వేసుకోవడం అంటే సమస్యలను పెద్దవి చేసుకోవడం అని కూడా నేతలు హైకమాండ్ విమర్శలు చేస్తున్నారు .
సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు .. అన్ని రకాల సమీకరణాలు చూసుకొని పలనా వాళ్లకు పదవులు ఇవ్వాలని సిఫార్సు చేస్తే ఇతరు నేతల నుంచి పోటీగా మరో జాబితా వెళ్తుంది .. రేవంత్ రెడ్డికి ఏకపక్ష ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్న హైకమాండ్ ఆయనకు పోటీగా వచ్చే వారిని ప్రోత్సహించినట్లుగా కనిపించేందుకు ప్రయత్నిస్తుంది వారి సిఫార్సులకు విలువ ఉన్నట్లుగా చేస్తోంది .. దీనితో ఈ పదవుల పంచాయతీ అందని ద్రాక్షగా కొనసాగుతుంది .