కొన్నేళ్ల క్రితం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 13 జిల్లాలు ఉండేవి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఏపీ జిల్లాలు కాగా మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతి పార్లమెంట్ ను ఒక నియోజకవర్గంగా భావించి ప్రజల సౌలభ్యం కోసం 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చారు.
 
అయితే ఈ మార్పు జరిగి ఏళ్లు గడుస్తున్నా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో కొత్త జిల్లాల పేర్లను చేర్చకపోవడం ఒకింత చర్చనీయాంశం అవుతోంది. పాత జిల్లాల ప్రకారమే కేంద్రం ఇప్పటికీ కార్యకలాపాలను నడిపిస్తోందని సమాచారం అందుతోంది. ఈ నిర్ణయాల వల్ల కొత్త జిల్లాల ప్రజలకు కొంతమేర ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలో ఉంది.
 
కూటమి సర్కార్ తలచుకుంటే రాష్ట్రపతి ఉత్తర్వుల్లో కొత్త జిల్లాల పేర్లను చేర్చడం మరీ కష్టం కాదు. అయితే కూటమి సర్కార్ మాత్రం ఆ దిశగా అడుగులు వేసినా ఆశించిన ఫలితం అయితే ఉండటం లేదని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పాత జిల్లాల లెక్కల్లోనే కార్యకలాపాలు నడపాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే భవిష్యత్తులో చంద్రబాబు ఏ విధంగా ముందుకెళ్తారో చూడాల్సి ఉంది.
 
కూటమి సర్కార్ ఎన్ని లేఖలు రాసినా ఫలితం లేకుండా పోయిందని భోగట్టా. ప్రస్తుతానికి పాత జిల్లాలను నడిపించడం మినహా మరో మార్గం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో అధికారంలోకి కూటమి సర్కార్ వచ్చి ఏడాది అవుతోంది. అతి త్వరలో సంక్షేమ పథకాల అమలు దిశగా కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. రాబోయే రోజుల్లో ఏపీ సర్కార్ ఎలాంటి నిర్ణయాలతో ముందుకెళ్తుందో చూడాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగించడంపై ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.




మరింత సమాచారం తెలుసుకోండి: