
ఆంధ్రప్రదేశ్లో గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. 2019 ఎన్నికలలో ఏకంగా 151 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీ గత ఏడాది జరిగిన ఎన్నికలలో కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఈ క్రమంలోనే పలు నియోజకవర్గాలలో సరైన నాయకత్వం లేక పార్టీ దీనస్థితిలో ఉంది. ఇప్పటికే చాలామంది కీలక నేతలు పార్టీని వీడారు. ఈ క్రమంలోనే గుంటూరు నగరంలోని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పార్టీని ముందుండి నడిపించే నాయకుడు లేక వైసిపి అనాధలా మారింది. గత ఎన్నికలలో చిలకలూరిపేట నుంచి అప్పుడు మంత్రిగా ఉన్న విడుదల రజిని గుంటూరు పశ్చిమం కు తీసుకువచ్చి జగన్ పోటీ చేయించారు. ఎన్నికలలో రజిని ఏకంగా 53, 000 ఓట్ల తేడాతో చిత్తుచిత్తుగా గల్లా మాధవి చేతిలో ఓడిపోయారు. ఎన్నికలలో ఓటమి తర్వాత రజనీని జగన్ తిరిగి చిలకలూరిపేట ఇన్చార్జిగా పంపేశారు. దీంతో ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీని నడిపించే నాయకుడు లేకుండా పోయారు.
అయితే గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అంబటి రాంబాబు తనకు పశ్చిమ నియోజకవర్గ పగ్గాలు ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు. అయితే గతంలో వైసిపి నుంచి ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తో పాటు మరో ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం కూడా తమకు నియోజకవర్గ ఇన్చార్జి పగ్గాలు అప్పగిస్తారని ఆశలు పెట్టుకున్న జగన్ మాత్రం ఎవ్వరికి నాయకత్వ బాధ్యతలు అప్పగించడం లేదు. మరోవైపు అంబటి రాంబాబు తనకే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పగ్గాలు ఇస్తారని ప్రచారం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా నగరంలో ఈ కీలక నియోజకవర్గం లో వైసీపీని ముందుండి నడిపించే నాయకుడు లేక వైసిపి అనాధలా మారిందని చెప్పాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు