
ఇటీవలే రైల్వే శాఖ ఒక పెద్ద కుంభకోణాన్ని కనిపెట్టింది. ఏవైతే ఐడి కార్డులు ఉన్నాయో అవి రెండున్నర కోట్ల దొంగ ఐడీ కార్డులు వచ్చాయని తాత్కాలిక టికెట్లకు సంబంధించి ఏడో ఎనిమిదో రకాల ఐడి కార్డులను యాక్సెప్ట్ చేస్తారు.. వాటిని బేస్ చేసుకుని ఇలాంవి జరుగుతున్నాయని గుర్తించిన రైల్వే శాఖ దీంతో ఇప్పుడు ఆ విధానాన్ని సైతం కంట్రోల్ చేయడానికి కొత్త కాన్సెప్ట్ ని తెరమీదకి తీసుకువచ్చింది.
తాత్కాలిక టికెట్లకు ఇకమీదట తప్పనిసరిగా ఆధార్ అనుసంధానం చేయడం వంటిది జరిగింది.. తాత్కాలికంగా టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే కచ్చితంగా ఆధార్ నెంబర్ ని ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఇలా ఎంటర్ చేసిన తర్వాత మన ఒరిజినల్ ఆధార్ వెబ్ సైట్ కి వెళ్లి దాని నుంచి ఒక ఓటిపి రావడం వంటిది సహజంగా జరుగుతూ ఉంటుంది.. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తేనే అప్పుడు తాత్కాల్ టికెట్స్ ఓకే అవుతుందన్నమాట. దీనివల్ల ప్రాసెస్ తలనొప్పిగా మారినప్పటికీ.. కానీ తప్పులను అరికట్టడానికి ఈ కొత్త మార్గాన్ని అనుసరిస్తుంది రైల్వే శాఖ. దీంతో ఇక మీదట టికెట్లు విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకునేలా రైల్వే శాఖ పలు నిర్ణయాలను తీసుకుంటోంది. ఇకమీదట అన్నిటికీ కూడా ఆధార్ కచ్చితంగా ఉండేలా ప్లాన్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అందుకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రస్తుతం ముందుకు అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.