ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒక పెద్ద వార్నింగ్ లాంటిది రెరా చైర్మన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇది ప్రజలకు కూడా ఒక మంచి సూచన లాగా కనిపిస్తోందట. రెరా చైర్మన్ తెలియజేసినటువంటి సమాచారం మేరకు.రెరా అనే ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.. రియల్ ఎస్టేట్ వ్యాపారుల మోసాల నుండి వినియోగదారుడిని కాపాడడానికి తీసుకువచ్చినటువంటి చట్టమే ఈ రేరా.. ఈ చట్టం కింద రిజిస్ట్రేషన్ అయినటువంటి ఫ్లాట్లు మాత్రమే కొనండి. రిజిస్ట్రేషన్ కాని వాటిని అసలు కొనవద్దు అంటూ పిలుపునిచ్చింది రెరా సంస్థ.


వాస్తవంగా 100 కి 70 శాతం వితౌట్  రెరా అమ్మేస్తున్నారట. గజాల లేకపోతే, కుంటల లెక్కన  అమ్మేస్తున్నారట.. రెరా తో ఉన్నప్పుడు ఏమిటంటే ఫ్లాట్లకు  రోడ్డు ఎంత ఉండాలి.. ఎంత మందంతో వేయాలి , వెడల్పు ఎంత ఉండాలి , ఓపెన్ స్పేస్ ఎంత ఉండాలి ఇలా అన్నిటిని కూడా రూల్స్ పాటించాలి.. ప్లస్ సదురు రియల్ ఎస్టేట్ వ్యాపారి కొంత డబ్బులు ప్రభుత్వం దగ్గర కూడా డిపాజిట్ చేయాల్సి ఉంటుందట.. ఎందుకంటే  ఒకవేళ ఆ ఫ్లాట్ అమ్మే వ్యక్తి మాట తప్పిన ఇతరత్రా ఇష్యులో కానీ మనం కొనుగోలు చేసిన రేపొద్దున రిజిస్ట్రేషన్ చేయించుకోవలసి ఉన్నప్పటికీ కూడా మనకి ఫ్లాట్ వద్దు అనుకున్నప్పటికీ  మన డబ్బులు మనకి వెనక్కి ఇచ్చేయాలి అంటే ఈ రెరా రూల్ బాగా ఉపయోగపడుతుంది.


ఒకవేళ ఇవ్వకపోతే చట్టపరంగా రెరా చర్యలు  తీసుకుంటుంది. అందుకే ఇప్పుడు అలాంటి వెసులుబాటు ఉన్నటువంటి రెరా అప్రూవల్ ప్లాట్లు మాత్రమే కొనండి అన్నటువంటిది రెరా తెలియజేస్తోంది. దీనివల్ల అటు వినియోగదారులు మోసపోకుండా ఉంటారని తెలియజేస్తుంది. మరి ఇలాంటి చట్టాలను కూడా వినియోగదారులు వినియోగించుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో ఆంధ్రాలో కూడా ఇలాంటివి మరింత అమలుకు కృషి చేస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: