2024 ఎన్నికల్లో ఏపీలో కూటమి అధికారంలోకి రావడానికి చంద్రబాబు ఇచ్చిన హామీలు కూడా ఒక విధంగా కారణమని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు 1500 రూపాయల చొప్పున ఏపీ సర్కార్ ఇవ్వాల్సి ఉండగా ఈ స్కీమ్ గురించి చంద్రబాబు నాయుడు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం తల్లికి వందనం స్కీమ్  అమలవుతున్న సంగతి తెలిసిందే. 13 వేల రూపాయల చొప్పున త్వరలో మహిళల ఖాతాలో ఈ నగదు జమ కానుంది.  ఎంతమంది పిల్లలు ఉన్నా పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు. తల్లికి వందనం పథకం అమలు ఏపీ  ప్రజల్లో ఆనందానికి కారణమవుతోంది.  గత ప్రభుత్వంతో పోల్చి చూస్తే ప్రస్తుతం ఈ పథకం ఒకింత మెరుగ్గా అమలవుతోంది అని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

తాజాగా చంద్రబాబు నాయుడు  తాజాగా ఒక పత్రికకు  ఇచ్చిన ఇంటర్వ్యూలో అవసరమైన వారికే ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పినట్టు తెలుస్తోంది.  ఆగస్టు 15 నుండి మహిళలకు ఫ్రీ బస్ అమలవుతుందని  బాబు చెప్పారు.  ఆడబిడ్డ నిధి పథకాన్ని పీ4 పథకంతో అనుసంధానం చేస్తామని  ఈ పథకాన్ని పూర్తిగా నిరుపేదలకు అవసరమైన వాళ్లకు మాత్రమే అందిస్తామని  చెప్పారని తెలుస్తోంది.

పూర్తిస్థాయిలో నిరుపేదలను ఏ విధంగా గుర్తిస్తారనే ప్రశ్నకు  మాత్రం జవాబు దొరకాల్సి ఉంది.  సాధారణంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం నిరుపేదలు అని చెప్పవచ్చు.  కూటమి సర్కార్ ఈ స్కీమ్  అమలు విషయంలో  ఏ  విధంగా ముందుకెళ్తుందో  చూడాల్సి ఉంది.  ఈ పథకానికి సంబంధించిన నియమ నిబంధనలు వెలుగులోకి వస్తే మాత్రమే ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరికే  ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: