గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫామ్ హౌస్ లో ఇప్పటికే వరుస ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పటి నుండి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు.ఎప్పుడు అక్కడే ఉంటూ అక్కడ నుండే రాజకీయాలను నడిపిస్తున్నారు. అయితే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిపోయింది అని తెలిసిందో అప్పటినుండి ఫార్మ్ హౌస్ లోనే ఉంటూ ఆ తర్వాత బాత్రూంలో కాలు జారిపడి తొంటి ఎముక విరగ్గొట్టుకున్నారు.ఆ టైంలో కేసీఆర్ ని చూడడానికి ఎంతో మంది ప్రముఖులు కూడా హాస్పిటల్ కి వెళ్లారు.అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే కేసీఆర్ దగ్గరికి వెళ్లిన సబితా ఇంద్రా రెడ్డి కూడా ఫుడ్ పాయిజన్ కి గురైంది.

అయితే తాజాగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా బాత్రూంలో కాలు జారిపడి కేసీఆర్ లాగే తొంటి ఎముక విరగ్గొట్టుకున్నారు. అయితే ఫామ్ హౌస్ లో వరుస ప్రమాదాలు జరగడంతో చాలామంది బీఆర్ఎస్ శ్రేణుల్లో భయం పట్టుకుంది.ఫామ్ హౌస్ లోనే ఇలా ఎందుకు జరుగుతుంది.. అక్కడ ఏదైనా ఉందా వాసు దోషమా.. లేక దుష్టశక్తుల ప్రభావమా అని ఎంతోమంది కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్లడానికి భయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారట కేసీఆర్.అయితే కేసీఆర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇద్దరు కూడా బాత్రూంలోనే జారిపడటంతో బాత్రూంలో  కొన్ని రిపేర్లు చేస్తున్నారట.

బాత్రూంలో ఉండే స్మూత్ టైల్స్ ని తీసేసి గరుకుగా కాలు వేసిన కూడా జారని టైల్స్ ని వేస్తున్నారట.అలాగే ఫామ్ హౌస్ లో భార్యతో కలిసి జ్యోతిష్యులు చెప్పినట్టుగా కొన్ని పరిహార పూజలు కూడా చేస్తున్నారట. అలా బాత్రూం లో కొన్ని మరమ్మతులు జరగడంతో ఆయన గత రెండు రోజుల నుండి ఫామ్ హౌస్ కి రావడం లేదంట.హైదరాబాద్ కి వైద్య పరీక్షల కోసం వెళ్లి అక్కడ నందీ నగర్ లో ఉన్న తన ఇంట్లోనే నివాసం ఉన్నారట. బాత్రూం మరమ్మతులు పూర్తయ్యాక మళ్ళీ కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్తారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: