
వల్లభనేని వంశీ విషయంలో కూటమి సర్కార్ సైతం ఒకింత కఠినంగా వ్యవహరిస్తోంది. గతంలో ఆయన చేసిన కామెంట్ల ఫలితంగా ఇప్పుడు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వల్లభనేని వంశీ వయస్సు ప్రస్తుతం 53 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారని గతంలో వార్తలు వచ్చాయి. కొందరు టీడీపీ నేతలు వంశీ విషయంలో సీరియస్ గా ఉన్నారని సమాచారం అందుతోంది.
ఇప్పట్లో వంశీ జైలు నుంచి విడుదల కావడం సాధ్యం కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వల్లభనేని వంశీకి ఈ వయస్సులో ఇలాంటి కష్టాలు ఎదురవుతూ ఉండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వైసీపీ సైతం అరెస్ట్ అయిన నేతలను కాపాడుకునే విషయంలో ఫెయిల్ అవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. వల్లభనేని వంశీ జూనియర్ ఎన్టీఆర్ కు సైతం ఆప్తుడు అనే సంగతి తెలిసిందే.
అయితే ఈ వివాదం విషయంలో తారక్ సైతం జోక్యం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. వల్లభనేని వంశీ భవిష్యత్తు వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియాల్సి ఉంది. వల్లభనేని వంశీ భవిష్యత్తులో రాజకీయాల్లో కొనసాగుతారా లేదా అనే చర్చ సైతం జరుగుతోంది. ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది. వల్లభనేని వంశీ విడుదల కోసం అయన కుటుంబ సభ్యులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు