సాధారణంగా ప్రపంచ మార్కెట్ లో  ఆర్థిక లావాదేవీలే ఏ పనైనా చేయించగలుగుతాయి..ప్రస్తుతం ప్రపంచ మార్కెట్ మొత్తం ఆర్థిక గమనం చుట్టే తిరుగుతోంది. ఒకప్పుడు రాజుల కాలంలో బంగారు, వెండి, రాగి, నాణేలు ఉండేవి. రాజుల కాలం కంటే ముందు చాలామంది ప్రజలు వస్తు మార్పిడి పద్ధతి ద్వారా జీవనం సాగించేవారు. ఒకరు ఉప్పిస్తే మరోకరు బియ్యం పంపించేవారు. ఇంకొకరు చింతపండు ఇస్తే మరొకరు కూరగాయలు ఇచ్చేవారు ఇలా ఒకరికొకరు వస్తు మార్పిడి చేసుకుంటూ జీవితాన్ని గడిపేవారు. పోను పోను వస్తూ మార్పిడి నుంచి కాస్త నాణేల వైపు ఆర్థిక గమనం చేరింది. ముఖ్యంగా వెండి, బంగారు, రాగి నాణేలతో మార్పిడి చేయడం వాటిని డబ్బులుగా భావించడం చేశారు.

 అలా ముందుకు వెళ్తున్న సమయంలోనే బ్రిటిష్ వారి పాలన మొదలైన తర్వాత కరెన్సీ నోట్లను తీసుకువచ్చారు. రూపాయి రెండు రూపాయలు ఇలా ఒక్కొక్క నోటు విలువను బట్టి ముద్రించేవారు. బ్రిటిష్ వారి కాలం నుంచే నోట్లు స్టార్ట్ అయి ఇప్పటివరకు కూడా అవే నడుస్తున్నాయి. కానీ ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కాస్త ముందడుగు వేసి ఆన్లైన్ పేమెంట్స్ వచ్చాయి. ప్రస్తుతం నోట్లతో పాటు ఆన్లైన్ పేమెంట్ ను కూడా చాలామంది ప్రజలు వాడుతున్నారు.

 ఇదిలా కొనసాగుతుండగానే ప్రపంచ ఆర్థిక గమనాన్ని మార్చేందుకు బిట్ కాయిన్ రూపంలో, మరో ఆర్థిక వ్యవస్థ రాబోతోంది. ఎస్సీసీ కమిషన్ హాస్టర్ పిఎస్  నివేదిక ప్రకారం అన్ని బ్యాంకుల్లో కూడా  బిట్ కాయిన్ సర్వీసెస్ స్టార్ట్ చేస్తున్నట్టు, బ్యాంకుల సర్వీసెస్ అన్ని కొత్త మార్గాన్ని చూపించబోతున్నాయి అంటూ ఒక న్యూస్ విడుదల చేశారు. ఈ బిట్కాయిన్ వస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సరికొత్త మార్పు రాబోతుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. మరి చూడాలి ఈ బిట్  కాయిన్ ఎఫెక్ట్ మన ఇండియాపై ఏమైనా పడుతుందా లేదంటే ప్రపంచ దేశాల్లోనే ముందుగా అది సర్కులేట్ అవుతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: