
తప్పుడు సీడింగ్ వల్ల తాము తల్లికి వందనం స్కీమ్ బెనిఫిట్స్ పొందలేకపోయామని వాళ్ళు చెబుతున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం నిరుపేద కుటుంబాల పాలిట శాపంగా మారింది. ప్రతి నెలా కరెంట్ చార్జీలు నామమాత్రంగా వస్తున్నా నగదు జమ కావడం లేదని వాళ్ళు వెల్లడిస్తున్నారు. ఒకే ఆధార్ కార్డుకు 70కు పైగా విద్యుత్ సర్వీసులు కనెక్ట్ కావడంతో కుమారి అనే మహిళ ఖాతాలో నగదు జమ కావడం లేదు.
తన తప్పు లేకపోయినా ఎక్కువ సంఖ్యలో మీటర్లను కనెక్ట్ చేశారని ఆమె చెబుతున్నారు. ఎవరో చేసిన తప్పులకు తాను శిక్ష అనుభవిస్తున్నానని ఆమె వెల్లడించారు. మీటర్లకు చెందిన వాళ్ళ ఆధార్ కార్డులు తెస్తే మాత్రమే పని జరుగుతుందని అధికారులు చెప్పడం కొసమెరుపు. రూల్స్ ఇలానే ఉన్నాయని తానేం చేయలేనని ఆమె చెప్పారు. సోంపేట మండలంలోని వేర్వేరు గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొందని భోగట్టా.
రోజువారీ కూలిపనులు చేస్తున్న కుటుంబాలకు ఈ తరహా పరిస్థితి ఎదురవుతోంది. తల్లికి వందనం పథకం నిబంధనలు ఎంతోమందికి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తల్లికి వందనం స్కీమ్ వల్ల ఎన్నో కుటుంబాలు ఊహించని స్థాయిలో ప్రయోజనం పొందాయి. తల్లికి వందనం పథకానికి ఎందుకు అర్హత పొందలేదో తెలియాలంటే సమీపంలోని గ్రామ సచివాలయంను సందర్శించాల్సి ఉంటుంది. తల్లికి వందనం స్కీమ్ వాళ్ళ దీర్ఘకాలంలో ఎన్నో లాభాలు పొందే అవకాశాలు అయితే ఉంటాయి.