లవ్ పాకిస్తాన్ అని ట్రంప్‌ అంటున్నారని ఆనందపరిపోయారు .. ట్రంప్ లంచ్ కి పిలిచాడని ఆర్మీ చీఫ్  మునీర్ ఎగిరి గంతేసుంటాడు .. అయితే ట్రంప్ అలా పిలవడానికి కారణం .. ఇరాన్ పై దాడికి అమెరికా రెడీ అవటమే .. పాకిస్తాన్ , ఇరాన్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి .. అంతేకాదు పాకిస్తాన్ సరిహద్దు దేశం కూడా .. అయితే అమెరికా , ఇరాన్ పై దాడి చేయడానికి పాకిస్తాన్ బేస్ ను ఉపయోగించుకునేందుకు అమెరికా రెడీ అవుతుంది .. అయితే ఇదే జరిగితే ఇరాన్ కు పాకిస్తాన్ కూడా శత్రుదేశం అవుతుంది .. అమెరికా , పాకిస్తాన్ గెడ్డపై నుంచి ఇరాన్‌ పై బాంబులేసి తన దారిన తాను వెళ్ళిపోతుంది .. అయితే ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ఇవాళ కాకపోతే రేపైనా ఇరాన్ , పాకిస్తాన్ సంగతి చూడకుండా ఉండదు .


ఇండియాలో చాలామంది ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను విందుకు పిలవడంపై రకరకాలుగా కామెంట్లతో స్పందించారు .. అలాగే మోదీ తన బెస్ట్ ఫ్రెండ్ అంటూనే .. ఈ విధంగా చేస్తున్నారు ఏంటని షాక్ అయ్యారు .  కానీ అగ్రరాజ్యం లెక్క  అగ్ర రాజ్యానికి ఉంటుంది .. పాకిస్తాన్ ను యుద్ధంలో ఓ పాముగా వాడుకునేందుకు మాత్రమే ట్రంప్ రెడీ అవుతున్నారు .. ఈ క్రమంలో పాకిస్తాన్ ను ఆయన బలి పసుపు చేయబోతున్నారు .. ఇలా ట్రంపు ట్రాప్ లో పడేందుకు మోడీ రెడీగా లేరు .. కెనడాలో ఉన్నప్పుడు మోదీకి ఫోన్ చేసి వైట్ హౌస్ కి రావాలని కోరారు తాను రానని మోదీ మొహం మీదే చెప్పేశారు .



అయితే త్వరలో క్వాడ్ దేశాల మీటింగ్ భారత్లో జరగనుంది .. ఇక ఈ సమావేశాలకి ట్రంప్ కూడా వస్తారు .. కానీ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లరు .. గతంలో ఏ అమెరికా ప్రెసిడెంట్ ఉపఖండంలో పర్యటించిన కచ్చితంగా మొదట భారత్ కు వచ్చి ఆ తర్వాత పాకిస్తాన్ కు వెళ్లేవారు .. లేకపోతే అక్కడికి వెళ్లి ఇక్కడకు వస్తూ ఉండేవారు .. ఈసారి మాత్రం ట్రంప్ పాకిస్తాన్ ను పక్కన పెట్టబోతున్నారు .. ట్రంప్‌కు పాకిస్తాన్ పై ఎలాంటి లవ్ లేదు .. ఆయనకు తన స్వార్థం మాత్రమే తెలుసు ఇరాన్‌ సంగతి తేల్చటానికి పాకిస్తాను వాడుకోబోతున్నారు .  ఇక ఆ తర్వాత పాకిస్తాన్ పరిస్థితి మరింత అంధకారంగా మారబోతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: