తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనే దానిపై ప్రజల్లో పెద్దగా క్లారిటీ లేకుండా పోయింది. దానికి ప్రధాన కారణం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి ఐదు సంవత్సరాల గడువు ముగిసిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయానికే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి ఐదు సంవత్సరాల దగ్గరికి వచ్చింది. దానితో బిఆర్ఎస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికలను జరుపుతుందేమో అని ప్రజలు భావించారు. కానీ బిఆర్ఎస్ పార్టీ ఆ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను జరపలేదు.

ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. దానితో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అత్యంత తక్కువ సమయంలోనే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తుంది అని అనుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరగడంతో కాంగ్రెస్ పార్టీ దానిపై ఎక్కువ దృష్టిని సారించింది. దానితో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదు. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులలో ఒకరు అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ నెల చివరన తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లు విడుదల చేస్తాం , వచ్చే నెల ఎన్నికల ను నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ విషయంపై కోర్టులో విచారణ జరుగుతుంది. ఇంతకుముందు కోర్టు ఎప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికల జరుపుతారు అని ప్రభుత్వాన్ని కొరగా వారు కొన్ని కారణాలను చెప్పారు.

ఇకపోతే తాజాగా రెండు సైడ్ల ఆర్గ్యుమెంట్ ముగిసింది. దానితో ప్రభుత్వం మేము ఎప్పుడైనా ఎలక్షన్లు పెట్టడానికి రెడీ 20 రోజుల సమయం కావాలి అని కోరగా , ఎలక్షన్ కమిషన్ మాకు 30 రోజుల సమయం కావాలి అని కోరింది. దానితో కోర్టు మరికొన్ని రోజుల్లో తీర్పు ఇవ్వనుంది. దానితో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎప్పుడు జరుగుతాయి అనేది క్లారిటీగా తెలిసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: