- ( గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

గ్రేటర్ హైదరాబాదులోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నిక‌ సాక్షిగా తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో తెలుగుదేశం - జనసేన - బిజెపి కలిసి కూటమి కట్టి సూపర్ హిట్ కొట్టినట్టుగానే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోను ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి జట్టు కట్టి పోటీ చేసి సూపర్ హిట్ కొట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. 2028 సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ 3 పార్టీలు కూటమికట్టి తెలంగాణలో అధికారంలోకి రావాలని అందుకు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నుంచే మూడు పార్టీలు కలిసికట్టుగా పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.


గత సాధారణ ఎన్నికలలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ చావు దెబ్బతింది. ఈ క్రమంలో ఈసారి జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో ల‌క్ష‌కు పైగా మైనార్టీ ఓటర్లు ఉండడంతో వారి మద్దతుతో ఇక్కడ పాగా వేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. బిఆర్ఎస్‌ తన సిట్టింగ్ సీటు నిలుపుకోవాలని పట్టుదలతో ఉంది. అయితే బిజెపి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ - జనసేనతో కలిసి కూటమిగా జట్టు కట్టడంతో అదే ఈక్వేషన్‌తో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోను పోటీచేసి వచ్చే ఎన్నికలలో తెలంగాణలో అధికారంలోకి రావాలని .. అందుకు ఈ ఉప ఎన్నికను అస్త్రంగా వాడుకోవాలని భావిస్తోంది.


ఒకవేళ ఈ ఉప ఎన్నికలలో తెలుగుదేశం పోటీ చేయాలని భావిస్తే ఆ పార్టీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఆమె 2018లో కూకట్‌ప‌ల్లి నుంచి టిడిపి తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఏది ఏమైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ సాక్షిగా కూటమి రాజకీయం తెలంగాణలో మొదలైనట్టే అనుకోవాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: