
కాపు జేఏసీ ఎవరితో గొడవలు పడకుండా అందరితో సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా అడుగులు వేస్తోంది. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు ప్రత్యేక బీసీ రిజర్వేషన్లను కల్పించాలని, రాష్ట్రంలో కాపులపై జరుగుతున్నా దాడులను అరికట్టాలని కృష్ణా జిల్లాకు వంగంవీటి రంగా పేరు పెట్టాలని ప్రతి సంవత్సరం 3000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి.
ఇవి కాకుండా రెండెకరాల్లో కాపు భవనాల నిర్మాణం జరగాలని కూటమి సర్కార్ కాపు నేతలకు రాజకీయ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రాధాన్యత గల శాఖల్లో మెయిన్ పొజిషన్స్ లో ఉద్యోగాలను ఇవ్వాలని ఉద్యోగుల అణచివేత విషయంలో సరైన దిద్దుబాటు చర్యలను తీసుకోవాలని తెలంగాణ నుంచి ఏపీలో కలిసిన మున్నూరు కాపు కుటుంబాల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
అయితే ఈ ప్రతిపాదనలకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. కూటమి సర్కార్ మాత్రం ఎవరినీ నొప్పించకుండా అడుగులు వేస్తూ ఉండటం గమనార్హం. జనసేన అధినేత, పవన్ కళ్యాణ్ సైతం కాపు నేతలకు బెనిఫిట్ కలిగే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం గమనార్హం.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు