
ఒకరిపై మరొకరు ఈగ వాలనీయకుండా, సమన్వయంతో పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ప్రభుత్వ వ్యతిరేక అంశాలపై ఒక్కటిగా స్పందించడం, నాయకుల జాయినింగ్స్ విషయంలో కలిసి నిర్ణయాలు తీసుకోవడం.. ఇదంతా ఒక కొత్త దృక్పథానికి నిదర్శనంగా చూస్తున్నారు. కవిత కారణంగానే కలయిక? ఈ చక్కని ట్యూనింగ్ వెనక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్ర ఉందన్నదే తాజా టాక్. ఇటీవల ఆమె రాసిన లేఖ లీక్ కావడం, పార్టీలో అసంతృప్తిని బయటపెట్టడం.. కేసీఆర్ ఫ్యామిలీలోనూ రాజకీయంగా కలకలం రేపింది. పార్టీకి ఇబ్బంది కలిగే వ్యాఖ్యలతో కాంగ్రెస్, బీజేపీలకు ‘ఆఫర్’ ఇచ్చినట్టయింది. దీంతో కేటీఆర్–హరీశ్ రావు అలపై చేసిన ఫామిలీ బాండింగ్ తిరిగి పటిష్టమవుతోంది. ఇటు కుటుంబ సమీకరణగా, అటు పార్టీలో గ్యాప్‌లు లేకుండా ఉంచాలన్న దృక్పథంతో ఇద్దరూ కలిసి ముందుకెళ్తున్నారు.
కేటీఆర్ ఇంటి నుంచి హరీశ్ ఇంటికి..! ఇటీవలి పరిణామాల్లో హరీశ్ ఇంటికి కేటీఆర్ వరుసగా వెళ్లడం, ప్రత్యేకంగా భేటీలు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో ఒక్క వేదిక మీద కనిపించని ఈ ఇద్దరూ.. ఇప్పుడు ప్రతి ముఖ్యమైన అంశం పై చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది కవితకు రాజకీయంగా ఎదురుదెబ్బగా మారిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ కేడర్ ఖుషీ..! ఇలాంటి పరిణామాలు BRS లో ఉన్న నాయకత్వ భద్రతపై సానుకూల సంకేతాలుగా మారుతున్నాయి. బలమైన సీనియర్లు కలిస్తే పార్టీ తిరిగి నిలదొక్కుకుంటుందని ఆశపడుతున్న క్యాడర్, కేటీఆర్–హరీశ్ కలయికను సానుకూలంగా చూస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లాంటి పార్టీల దూకుడు మధ్య లోపాలు లేకుండా ఉండాలంటే.. ఇటువంటి చక్కటి సమన్వయం అవసరమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.