ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఒకటైన టీసీఎస్ కంపెనీలో పని చేయడం ఎంతోమంది ఉద్యోగుల కల అనే సంగతి తెలిసిందే. ఈ కంపెనీలో ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించినట్టు ఫీలవుతారు. అయితే ఈ కంపెనీ తాజాగా 12000 మందిని తొలగిస్తున్నట్టు చేసిన ప్రకటన ఒకింత సంచలనం అయింది. యూనియన్ ఆఫ్ ఐటీ & ఐటీఈఎస్ ఎంప్లోయ్స్ దీనిని వ్యతిరేకిస్తోంది. లే ఆప్స్ విషయంలో ప్రభుత్వం సైతం జోక్యం చేసుకోవాలనే డిమాండ్స్ సైతం పెరుగుతున్నాయి.

అయితే ఈ నిర్ణయంఏకంగా 30000 మందిపై ప్రభావం చూపే ఛాన్స్ అయితే ఉందని  సమాచారం అందుతోంది.  12,000 మంది ఉద్యోగులను తొలగించాలన్న  నిర్ణయానికి వ్యతిరేకంగా చెన్నైలో  మంగళవారం రోజున యునైట్ ఆధ్వర్యంలో  యూనియన్ నాయకులు ఆందోళనను చేపట్టారు.  టీసీఎస్ కు వ్యతిరేకంగా ప్లకార్డులతో పాటు బ్యానర్లను  ప్రదర్శించింది.

సీనియర్, మేనేజర్ స్థాయి ఉద్యోగులను మాత్రమే టీసీఎస్ తొలగిస్తుండటం గమనార్హం.  ఈ ప్రక్రియలో  30,000 నుంచి 40,000 మందిపై తీవ్రస్థాయిలో ప్రభావం పడే ఛాన్స్ అయితే ఉంటుందని జనని అనే యునైటెడ్ లీడర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.  ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లకు బదులుగా తక్కువ జీతంతో టీసీఎస్ కొత్తవాళ్లను నియమించుకుంటోందని  యునైట్ తెలిపింది.

ఉద్యోగులను తొలగించడానికి బదులుగా వాళ్ళ నైపుణ్యాలను పెంచడానికి ప్రయత్నించాలని యునైట్ కోరింది. ఈ ఊహాగానాలు తప్పుదోవ  పట్టించే విధంగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.  అయితే టీసీఎస్  రాబోయే రోజుల్లో మరి కొందరి ఉద్యోగులను  తొలగించకుండా ఉంటే బాగుంటుందని చెప్పవచ్చు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

tcs