ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు ఏ విధంగా జరిగాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా కూటమికి, వైసిపి పార్టీకి హొరా హోరిగా జరిగింది. ఇటీవలే పులివెందల, ఒంటిమిట్ట జరిగిన ఉప ఎన్నికలు కూడా సంచలనంగా మారాయి. ఇప్పుడు తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం జనవరిలో మరో ఎన్నికలు నిర్వహించడానికి కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం పాలకవర్గాల పదవీకాలం ముగియడానికి ముందే ఈసారి ఎన్నికల నిర్వహించేలా ఆలోచిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పంచాయితీ రాజుతో పాటు, పురపాలక శాఖ కమిషనర్లకు లేఖల ద్వారా తెలిపారు.


ప్రస్తుతం సర్పంచ్ల పదవీకాలం కూడా 2026 ఏప్రిల్ కి ముగుస్తుంది.. వచ్చే ఏడాది మార్చిలోనే కార్పొరేషన్లు, మున్సిపాలిటీ, నగర పంచాయతీ కార్పొరేటర్లు ,కౌన్సిలర్లు పదవి కాలం కూడా ముగియనుంది. వారి పదవీకాలం ముగియడానికి మూడు నెలల ముందే ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నది.(మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1995 ప్రకారమే నిర్వహించబోతున్నారు). అందుకే జనవరిలోనే ఎన్నికలు నిర్వహించాలని SEC భావిస్తోంది.


రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాసిన లేఖ ప్రకారం ఎన్నికల నిర్వహించడానికి షెడ్యూల్ ఎలా ఉందంటే.. రాష్ట్రవ్యాప్తంగా వార్డుల పునర్విభజన జరిగి రిజర్వేషన్ల ప్రక్రియను 2025 అక్టోబర్ 15 లోపల పూర్తి చేయాలి. అలాగే వార్డుల వారిగా ఓటర్ల జాబితాలను కూడా అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15 లోపల పూర్తి చేయాలి.  ఇలా అన్నిటిని పూర్తి చేసుకున్న తర్వాత  రాజకీయ పార్టీలతో ఈ ఏడాది చివరిలో సమావేశం నిర్వహించి..2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి అదే నెలలో ఫలితాలను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.


అలాగే గ్రామపంచాయతీలకు కూడా 2026 జనవరిలో, జులై నుంచి ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలు ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తం మీద వచ్చే ఏడాది కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఎన్నికలు కూడా ఏపీలో ఎలాంటి పరిణామాలను తీసుకువచ్చేలా చేస్తాయో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: