మంచి తరుణం మించిన దొరకదు సందు దొరికింది అక్క‌డ ఖ‌ర్చీఫ్ వేసేద్దామ‌నుకున్నారు. మాజీ ఎమ్మెల్యే యాక్టివ్ గ లేని టైమ్‌ చూసి ఇక జెండా పాతేద్దాం అనుకున్న టైమ్‌ లో సీన్ కాస్త రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఆయ‌న ఆశ‌లు అడియాస‌లు అయిపోయాయి. రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు... ఏది అశాశ్వ‌తం కాదు.. అలాగే సీటు కూడా గ్యారంటీ కాదు. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పరిస్థితి కూడా అచ్చు అలాగే ఉంది. మాధ‌వ్ 2024 ఎన్నికల తర్వాత ఏదో చేద్దాం అనుకునేవాడు అడ్వాన్స్ అయ్యే సరికి పెద్ద సార్‌కు కాలిపోవ‌డం.. కోప‌గించుకోవ‌డంతో ఇప్పుడు దెబ్బ‌కు కామ్ అయిపోయాడ‌ట‌.


ఉమ్మడి అనంతపురం జిల్లాలో పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్‌ గా పనిచేస్తున్న గోరంట్ల మాధ‌వ్ 2019 ఎన్నికలకు ముందు వైసిపిలో చేరారు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఇవ్వగానే ఎంపీ టికెట్ దక్కడం, హిందూపురం నుంచి భారీ మెజార్టీతో గెలవడం చకచకా జరిగిపోయాయి. పోలీస్ గా ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ తరహా వ్యవహార స్టైల్లో ఉండేవారు. దీంతో నిత్యం వార్త‌ల‌లో ఉండేవారు. ఎంపీ అయ్యాక ఆయ‌న అదే దురుసు ప్ర‌వ‌ర్త‌న‌తో ఉండేవారు. అన్నింటికి మించి ఓ బూతు వీడియో దెబ్బ‌కు ఆయ‌న ప‌రువు మొత్తం పోయింది. ఈ కార‌ణంతోనే గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు సీటు ద‌క్క‌లేదంటారు.


ఎన్నిక‌ల త‌ర్వాత‌ కాస్త స్తబ్దుగా కనిపించిన ఓటమి తర్వాత తిరిగి రీఛార్జ్ అయ్యారు. రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ ఎం ఎల్‌ ఏ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కొన్నాళ్ల యాక్టివ్ గా లేరు. ఓటమి తర్వాత చాన్నాళ్లు అసలు ఉన్నారా లేరా ? అన్నట్టుగా ఉండేవారు. తోపుదుర్తి సరిగ్గా ఆ టైమ్‌ చూసి నియోజకవర్గం మొత్తం కలిగి తిరిగారు. గోరంట్ల నిత్యం ఏదో అంశాన్ని బేస్ చేసుకుని అక్కడ జనంలోకి చొచ్చుకెళ్ళే ప్రయత్నం చేశారు. ఇంకా చెప్పాలంటే రాప్తాడు సీటు మాధ‌వ్‌దే అన్న‌ట్టుగా దూసుకుపోయారు.


వెంట‌నే తుపుదుర్తి విష‌యాన్ని పార్టీ అధినేత‌కు చెప్ప‌డం.. అధినేత స‌మాచారంగా మాధ‌వ్‌ను రాఫ్తాడులో అడుగు పెట్ట‌వ‌ద్ద‌ని చెప్ప‌డంతో మాధవ్ మళ్ళీ రాప్తాడు వైపు రాకుండా బ్రేకులు వేయగలిగిరట. మాజీ ఎమ్మెల్యే ఓ వైపు తోపుదుర్తి నో ఎంట్రీ బోర్డు పెట్టేస్తే మరోవైపు వైసీపీ అధిష్టానం కూడా అటువైపు చూడద్దని చెప్పేయంతో ఇప్పుడు మాధ‌వ్ రాఫ్తాడు సీటుపై ఖ‌ర్చీఫ్ వేసినా ఆశ‌లు అడియాస‌ల‌య్య‌య‌న్న గుస‌గుస‌లు స్థానికంగా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: