బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారే పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత prasad YADAV' target='_blank' title='లాలూ ప్రసాద్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి కేంద్ర దర్యాప్తు సంస్థల నుండి పెద్ద షాక్ తగిలింది. ఐఆర్సిటిసి అవినీతి కేసులో లాలూతో పాటు ఆయన భార్య రాబ్రీ దేవి, కుమారుడు తేజశ్వీ యాదవ్‌లపై ఢిల్లీ కోర్టు సోమవారం అధికారికంగా అభియోగాలు మోపింది. ఈ కేసు బీహార్‌లో ఎన్నికల ముందు వెలుగులోకి రావడంతో ఆర్జేడీ శిబిరంలో కలకలం రేగింది. అక్టోబర్ 6 నుండి 11 వరకు జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామం ఆ పార్టీకి పెద్ద ఇబ్బందిగా మారనుంది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి విశాల్ గగ్నీ ఈ కేసులో లాలూ కుటుంబంపై అవినీతి నిరోధక చట్టం  కింద కఠిన అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసు విచారణ ఈ నెల చివరి వారంలో ప్రారంభం కానుందని కోర్టు వెల్లడించింది. అదే సమయంలో లాలూ కుటుంబం ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేయనున్నట్లు సమాచారం.లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పనిచేసిన కాలంలోనే ఈ అవినీతి జరిగినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. 2017లో నమోదు చేసిన ఈ కేసులో లాలూ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి, ఐఆర్సిటిసి హోటల్ నిర్వహణ కాంట్రాక్టులను పట్నాకు చెందిన సుజాత హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అక్రమంగా అప్పగించారని ఆరోపణలు ఉన్నాయి.


దానికి ప్రతిఫలంగా, లాలూ కుటుంబం తనకు అనుబంధంగా ఉన్న సంస్థల ద్వారా పట్నా నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో సుమారు మూడు ఎకరాల భూమిని తక్కువ ధరకు పొందింది అని సీబీఐ ఆరోపించింది.  లాలూ అధికారంలో ఉన్నప్పుడు పలు వ్యక్తుల నుంచి డబ్బు డిమాండ్ చేసినట్లు కూడా దర్యాప్తు సంస్థలు తెలిపారు.ఈ అభియోగాలు వెలుగులోకి రావడంతో బీహార్ రాజకీయాల్లో కలకలం రేగింది. లాలూ కుటుంబం ఎప్పటినుంచో ప్రజాస్వామ్యానికి, సామాజిక న్యాయానికి ప్రతీక అని చెబుతూ వస్తుంటే, ఇప్పుడు అవినీతి మచ్చతో చిక్కుల్లో పడిన పరిస్థితి ఏర్పడింది. ప్రతిపక్ష నేతలు ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, “ఇలాంటి వ్యక్తుల చేతిలో రాష్ట్ర భవిష్యత్తు సురక్షితం కాదు” అని వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు అధికారాని అడ్డుపెట్టుకోని లాలూ ఆయన కుటుంబం చాలా నీచమైన పనులు కూడా చేసిందట. లోకల్ గా ఉండే గూండాలతో కూడా లాలూ ఆటైంలో గొంగ పనులు చేయించుకున్నారట.

 

తేజశ్వీ యాదవ్ ఈ కేసు రాజకీయ ప్రేరేపితమని చెబుతూ కోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకించారు. “మా కుటుంబం ఎప్పుడూ ప్రజల కోసం పనిచేసింది. కానీ మమ్మల్ని ఎన్నికల ముందు దెబ్బతీయడానికి కుట్ర జరుగుతోంది” అని ఆయన పేర్కొన్నారు.బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో, లాలూ కుటుంబంపై వచ్చిన ఈ అభియోగాలు ఆర్జేడీ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. ఇప్పటికే ఎన్డీఏ శిబిరం ఈ అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించనుందని సమాచారం. “అవినీతి చేసిన వాళ్లకు బీహార్ ప్రజలు సమాధానం చెబుతారు” అని బీజేపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.మరోవైపు, ఆర్జేడీ నాయకులు మాత్రం ప్రజలు లాలూ కుటుంబంపై నమ్మకం ఉంచారని, ఈ కేసులు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయవని ధీమా వ్యక్తం చేస్తున్నారు.



ఏది ఏమైనా, బీహార్ రాజకీయాలు మళ్లీ prasad YADAV' target='_blank' title='లాలూ ప్రసాద్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>లాలూ ప్రసాద్ యాదవ్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఒకవైపు ఎన్నికల వేడిమి, మరోవైపు అవినీతి కేసు నాటకీయ మలుపులు — ఇవన్నీ కలిపి బీహార్ రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని కుదిపేస్తున్నాయి. ఇప్పుడు అందరి చూపు కోర్టు తీర్పుపైనే ఉంది. లాలూ కుటుంబం ఈ అవినీతి ఆరోపణల నుంచి బయటపడుతుందా? లేక ఈ ఎన్నికల్లో ఆర్జేడీ పార్టీకి ఇది పెద్ద దెబ్బ అవుతుందా? అనేది త్వరలోనే తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: