కాంచనదేశపు రాకుమార్తె శంతనను వేదాంత దేశ రాకుమారుడు అనంత సేనుడికి ఇచ్చి పెళ్లి చేద్దామని.. దేశపు రాజు నిశ్చయించుకున్నాడు. తండ్రి నాగ వర్ధనుడు ఆమె చిత్రపటాన్ని వేదాంత నగరం పంపించాడు. రాకుమారికి తెలివి తేటలుంటేనే పెళ్లాడతానన్నాడు.. రాజకుమారుడు. తర్వాత దూత ద్వారా మోరం గడ్డలు పంపించాడు.. రాకుమారినికి ఆమె ప్రతిగా మానెడు జొన్నలు మూటకట్టి పంపించింది. వాటిని చూసి, మరునాడు మానెడు సజ్జలు పంపించాడు. రాకుమారి వాటిని తీసుకొని రెండు మానికల ధాన్యం పంపించింది. రాకుమారుడు ప్రతిగా ఒక కుక్క పిల్లను పంపాడు. రాణికి ఆమె జవాబుగా ఒక కోతిని పంపించింది.

దాన్ని చూసిన అనంత సేనుడు మహారాణి కి కావలసిన అర్హతలన్నీ శంతనకున్నాయి. ఆమెను పెళ్లి చేసుకుంటాను అని తండ్రితో చెప్పాడు.
నువ్వా ఆమెకు పంపిన కానుకల్లో అర్థం ఏమిటో ఆమె కానుకలతో ఏం సమాధానం చెప్పిందో నీకు ఎందుకు నచ్చిందో మేము కూడా తెలుసుకుంటే సంతోషిస్తాం గదా! అన్నాడు తండ్రి .. వాళ్ల నాగరికత ఏ దశలో ఉందో చూద్దామని, మొరం గడ్డలు పంపాను. మేము వాటిని మానేసి జొన్నరొట్టెలు తింటున్నాం అని పంపింది. నేను సజ్జలు పంపాను వండుకొని తినమని అవి మానేసి సన్నబియ్యం తింటున్నామని,  నీ కంటే ఒక మెట్టు పైనే ఉన్నా మన్నట్లు . దాన్యం పంపింది అన్నాడు.
మరి ఈ కుక్క కోతి గొడవ ఏంటి? అన్నాడు తండ్రి.. రాకు మారిని ఆట పట్టించడానికి కుక్క పిల్లలు పంపాను. దానికి మీరు ఆంజనేయ స్వామి భక్తులు కదా అందుకే మీకు ప్రియమనీ కోతి ని పంపిస్తున్నాను అని చెప్పకనే చెప్పింది అన్నాడు.

ఇంకేం... అందము తెలివితేటలు కూడా వచ్చాయి. ఈ రోజే మా వియ్యంకుడి కి కబురు పంపిస్తాను, అన్నాడు రాజు.. అలా సమయానికి తగ్గట్టుగా ఆలోచించగలిగితే ఎటువంటి విజయం సాధించవచ్చు అని మనం ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చును.

మరింత సమాచారం తెలుసుకోండి: