డేవిడ్ వార్నర్.. ఈ ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ అటు భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడాబాగా దగ్గరయ్యాడు.  ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో భారత హీరోల సినిమాల పాటలపై డాన్సులు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. సన్రైజర్స్ జట్టులో ఎన్నో ఏళ్ల పాటు కీలక ఆటగాడిగా కొనసాగి తెలుగు ప్రేక్షకులందరికీ ఇంకా దగ్గరయ్యాడు అనే చెప్పాలి. కానీ ఇటీవలే సన్రైజర్స్ హైదరాబాద్ డేవిడ్ వార్నర్ ని వదులుకోవడం తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అతని కొనుగోలు చేసింది.అయితే మొన్నటి వరకూ పాకిస్థాన్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా  జట్టులో ఉన్న డేవిడ్ వార్నర్ అక్కడ సిరీస్ ముగియడంతో ఇటీవలే క్వారంటైన్  చేసుకుని ఢిల్లీ లో చేరిపోయాడు.


 డేవిడ్ వార్నర్ లాంటి స్టార్ ప్లేయర్ రాకతో ఢిల్లీ జట్టు ఎంతో పటిష్టంగా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ గురించి డేవిడ్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ రిషబ్ పంత్ నుండి ఒక్క చేత్తో షాట్లు ఆడటం ఎలాగా నేర్చుకుంటాను అంటూ చెబుతున్నాడు డేవిడ్ వార్నర్. అయితే 2009లో ఢిల్లీ తోనే ఐపీఎల్లో ప్రస్థానం మొదలు పెట్టాడు డేవిడ్ వార్నర్. కానీ ఆ తర్వాత మధ్యలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడాడు. మళ్లీ ఇప్పుడు ఢిల్లీ జట్టులోకి పునరాగమనం చేశాడు డేవిడ్ వార్నర్.  కాగా నేడు గుజరాత్ టైటన్స్ తో జరగబోయే మ్యాచ్ లో ఇక డేవిడ్ వార్నర్ ఢిల్లీ జట్టుకు అందుబాటులో ఉండబోతున్నాడు అనేది తెలుస్తుంది.


 రిషబ్ పంత్ నుంచి ఒక చేత్తో షాట్లు ఆడటం ఎలాగా నేను నేర్చుకుంటున్నాను.. అతను కుర్రాడు.. ఇప్పుడిప్పుడే నాయకత్వాన్ని వంట పట్టించుకున్నాడు.. ఇక భారత జట్టులో కీలక ఆటగాడిగా కూడా ఉన్నాడు.. అతడితో కలిసి బ్యాటింగ్ చేయడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను అంటూ డేవిడ్ వార్నర్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేశాడు.  రిషబ్ పంత్ తో పాటు రికీ పాంటింగ్ గురించి కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీ కోచ్ గా రికీ బాగానే విజయవంతమయ్యాడు. ఆస్ట్రేలియా అతడు జట్టును ఎంతో గొప్పగా నడిపించాడు. ఇప్పుడు కోచ్ గా గౌరవాన్ని పొందుతున్నాడు. అతనితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది అంటూ డేవిడ్ వార్నర్ తెలిపాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: