డేవిడ్ వార్నర్.. ఈ ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ గురించికొత్తగా ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదేమో. కానీ మనం గొప్ప క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కాస్త ఇంట్రడక్షన్ ఇస్తే బాగుంటుంది. డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ గా ఆ జట్టుకు ఎన్నో విషయాలను అందించాడు.  ఇక ఆస్ట్రేలియా జట్టులో తిరుగులేని ప్రస్థానం కొనసాగించాడు. ఇక ఆ తర్వాత ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ గా మారిపోయి  తెలుగు ప్రేక్షకులందరికీ మరింత దగ్గరయ్యాడు.


 అంతేకాదు పసికూన లాంటి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఒకసారి ఐపీఎల్ టైటిల్ అందించి కెప్టెన్సీకి తిరుగులేదు అని నిరూపించాడు డేవిడ్ వార్నర్. ఇక డేవిడ్ వార్నర్ అనే పేరు తీయగానే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు గుర్తుకు వచ్చే విధంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ గత ఏడాది ఐపీఎల్ సీజన్లో మాత్రం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఈ స్టార్ ప్లేయర్ నీ సన్ రైజర్  యాజమాన్యం పక్కనపెట్టేసింది. కనీసం మైదానంలోకి కూడా రానివ్వలేదు. చివరికి మెగా వేలంలో కి వదిలేసింది. డేవిడ్ వార్నర్ ని వదిలేసిన సన్రైజర్స్ ఇక ఇప్పుడు బాధ పడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే డేవిడ్ వార్నర్ ని సొంతం చేసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఆ జట్టు ఓపెనర్ గా అద్భుతంగా రాణిస్తున్నాడు డేవిడ్ వార్నర్.


 ఇక ఇటీవలే స్వయంగా డేవిడ్ వార్నర్ ఢిల్లీ జట్టులో ఆడటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీ జట్టులో తన ప్రయాణం బాగుంది అంటూ తెలిపాడు డేవిడ్ వార్నర్. ఓపెనర్ గా సమయాన్ని ఆస్వాదిస్తునాను అంటూ చెప్పుకొచ్చాడు.ఒక ఎండ్ లో పృథ్వీషా ధాటిగా ఆడుతూ ఉంటే మరో ఎండ్ లో ఉన్న తనకు పని కాస్త తేలిక అవుతుంది అంటూ డేవిడ్ వార్నర్ తెలిపాడు. కోల్కత్త తో జరిగిన మ్యాచ్ లో తాము అద్భుతంగా ఆడాము అంటూ సంతోషం వ్యక్తం చేశాడు డేవిడ్ వార్నర్. ఇక డేవిడ్ వార్నర్ అద్భుతంగా రాణిస్తూ ఉండటంతో సన్రైజర్స్ అభిమానులు మాత్రం జట్టు యాజమాన్యం అతన్ని  ఎందుకు వదులుకుందో అని బాధపడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: