క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ గత కొంతకాలం నుంచి వార్తల్లో నిలుస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న గోవా జట్టు తరఫున బరిలోకి దిగిన సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ మొదటి మ్యాచ్ లోనే సెంచరీ చేసి అదరగొట్టాడు. దీంతో వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. అయితే ఇక రంజి ట్రోఫీలో ఆడటానికి ముందు అర్జున్ టెండూల్కర్ మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో మెలుకువలను నేర్చుకొని రాంచీలో అడుగు పెట్టాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే అర్జున్ టెండూల్కర్ కెరియర్ గురించి.. ఇక అర్జున్ కు ట్రైనింగ్ ఇస్తున్న సమయంలో తనకు ఎదురైన అనుభవాల గురించి భారత మాజీ ప్లేయర్ యోగ్ రాజ్ సింగ్ ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు. కాగా అర్జున్ టెండూల్కర్ కు గాయం అయిన సమయంలో అతను చెప్పిన మాట అతని తండ్రి సచిన్ ను గుర్తు చేసింది అంటూ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ చెప్పుకొచ్చాడు. ఓ రోజు అర్జున్  బ్యాటింగ్ చేస్తుండగా బంతి వేగంగా వెళ్లి అతని దవడకు తగిలింది. దీంతో అతని ముఖం మొత్తం ఉబ్బిపోయి రక్తం కారడం మొదలైంది.


 ఆ సమయంలో అర్జున్ టెండూల్కర్ ను విశ్రాంతి తీసుకో అటు చెప్పాను. కానీ అతను మాత్రం నేను ఆడతాను అంటూ ఇక బ్యాటింగ్ కొనసాగించే ప్రయత్నం చేశాడు. ఇక అర్జున్ టెండూల్కర్ ఆ సమాధానం చెప్పగానే నాకు అతని తండ్రి సచిన్ టెండూల్కర్ గుర్తొచ్చాడు. ఎందుకంటే కెరియర్ తొలి రోజుల్లో సచిన్ కూడా ఇలా గాయంతోనే ఆటను కొనసాగించిన సందర్భాలు చాలానే ఉన్నాయి అంటూ యోగ్ రాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు. అర్జున్ మాటలు విని వెంటనే కౌగిలించుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నాను. ఎందుకంటే అప్పటికే అర్జున్ ముఖం చాలా వాచింది. అయితే డాక్టర్కు చూపించుకున్నాక మరుసటి రోజు అతను శిక్షణకు హాజరయ్యాడు. ఆట విషయంలో అతని సంకల్పం నాకు నచ్చింది అంటూ యోగ్ రాజ్ మెచ్చుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: