శుభమన్ గిల్.. గత కొంతకాలం నుంచి భారత క్రికెట్ లో మారుమోగిపోతున్న పేరు. ఎందుకంటే భారత క్రికెట్ లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్న శుభమన్ గిల్ తన ప్రదర్శనతో ఇరగదీస్తున్నాడు అని చెప్పాలి.  ముఖ్యంగా బ్యాటింగ్లో విధ్వంసాన్ని కొనసాగిస్తూ అదరగొడుతున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా సరే వీర విహారం చేస్తూ పరుగుల వరద పారిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే డబుల్ సెంచరీ సాధించిన ఇషాన్ కిషన్ కూ బదులు శుభమన్ గిల్ ను ఎందుకు జట్టులోకి తీసుకుంటున్నారు అనే విమర్శలు చేస్తున్న వారందరి నోర్లు తన ప్రదర్శనతోనే మూయించాడు  శుభమన్ గిల్.


 మొన్నటికి మొన్న శ్రీలంకతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో సెంచరీ తో చెలరేగిపోయాడు. అయితే శుభమన్ గిల్ చేసిన సెంచరీ గురించి అందరూ చర్చించుకుంటున్న సమయంలోనే ఇక ఇటీవల అటు న్యూజిలాండ్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో డబుల్ సెంచరీ చేసి ఎన్నో ప్రపంచ రికార్డులను కొల్లగొట్టాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శుభమన్ గిల్. ఫ్యూచర్ స్టార్ అంటూ ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా అతనిపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే శుభమన్ గిల్ తండ్రి లక్వీందర్ గిల్ మాత్రం ఏకంగా శుభమన్ గిల్ ఔట్ అయిన తీరుపై విమర్శలు చేయడం గమనార్హం.


 అయితే డబుల్ సెంచరీ చేసినప్పుడు కాదు శ్రీలంకపై సెంచరీ చేసిన అనంతరం ఇక అతను అవుట్ అయిన తీరుపై అతని తండ్రి కీలక వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. గిల్ సహచరుడు పంజాబ్ ఆటగాడైన గురు కిరీత్ సింగ్ మాన్ చెప్పిన దాని ప్రకారం.. శ్రీలంక పై గ్రిల్ సెంచరీ చేశాక.. అవుట్ అయిన విధానంపై అతని తండ్రి అసంతృప్తి వ్యక్తం చేశాడట. మంచి ఆరంభం లభించాక సెంచరీ చేశాడు. డబుల్ సెంచరీ చేసే అవకాశం ఉన్న అవుట్ అయ్యాడు. ఇలాంటి అవకాశాలు ప్రతిసారి రావు.. ఇంకెప్పుడు నేర్చుకుంటాడో ఏమో అంటూ గిల్ తండ్రి అసంతృప్తి వ్యక్తం చేశారట. అయితే ఇక దీనిని చాలెంజింగ్ గా తీసుకున్న శుభమన్ గిల్ ఆ తర్వాత మ్యాచ్లోనే డబుల్ సెంచరీ చేశాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Gil