
అయితే కేవలం సినిమాలు రాజకీయాల్లోనే కాదు క్రీడారంగంలో కూడా ఇక ఇలాంటి వారసత్వం కొనసాగుతుంది అని చెప్పాలి. ఒకప్పుడు ఆయా క్రీడలలో రాణించి ఇక స్టార్ ప్లేయర్లుగా ఎదిగిన వారు ఇక వారు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మాత్రం వారి వారసులను ఇక అదే క్రీడారంగానికి పరిచయం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు భారత క్రికెట్లో లెజెండరీ క్రికెటర్ గా కొనసాగుతున్న రాహుల్ ద్రవిడ్ సైతం ఇదే చేస్తున్నాడు. దాదాపు దశాబ్ద కాలానికి పైగానే టీమిండియా కు ప్రాతినిధ్యం వహించాడు రాహుల్ ద్రావిడ్.
ఇక తన ఆట తీరుతో ఎన్నో మరుపురాని విజయాలు అందించడమే కాదు ప్రపంచ రికార్డులు కూడా కొలగొట్టాడు. ఇక ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ కొడుకు ఇలా ప్రపంచ క్రికెట్లో రాణించేందుకు ఇప్పటినుంచి సన్నదమవుతున్నాడు. ఇకపోతే తండ్రి లాగే క్రికెట్లో రాణిస్తున్నాడు కర్ణాటక అండర్ 14 క్రికెట్ టీం కెప్టెన్ గా రాహుల్ ద్రావిడ్ కొడుకు అన్వాయ్ ద్రవిడ్ ఎంపికయ్యాడు. కేరళలో జరగనున్న ఇంటర్ జోనల్ టోర్నీ లో జట్టుకు సారధ్యం వహించబోతున్నాడు. గతంలో అన్వయ్ అన్నయ్య ద్రవిడ్ పెద్దకొడుకు సమీత్ ద్రవిడ్ సైతం కర్ణాటక అండర్ 14 జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు.