
అయితే గత మూడేళ్ల నుంచి కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అద్భుతమైన సత్తా చాటుతున్న టీమిండియా ఇక వరుసగా సిరీస్ లను గెలుచుకుంటూ వస్తుంది. ఈ టెస్ట్ సిరీస్ ఆస్ట్రేలియా వేదికగా జరిగిన.. లేదంటే భారత్ వేదికగా జరిగిన కూడా సిరీస్ మాత్రం భారత్ దే అనే విధంగా విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉంది అని చెప్పాలి. అయితే ఇక మరికొన్ని రోజుల్లో అటు ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుండగా ఎంతోమంది భారత ఆటగాళ్ళను అరుదైన రికార్డులు ఊరిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ ముందు కూడా ఒక అరుదైన రికార్డు ఉంది.
ఆస్ట్రేలియాతో జరగబోయే నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ లో ఒకవేళ రోహిత్ శర్మ సెంచరీ చేశాడు అంటే చాలు ఇప్పటివరకు ఏ భారత క్రికెటర్‌కు సాధ్యం కానీ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంటాడు. కెప్టెన్ గా టెస్ట్, వన్డే టి20 ఫార్మాట్లో శతకం బాదన తొలి భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలుస్తాడు అని చెప్పాలి. రోహిత్ శర్మ కెప్టెన్ గా వన్డే, టీ20 లో ఇప్పటికే సెంచరీలు చేశాడు. టెస్టుల్లో మాత్రం సెంచరీలు ఉన్నప్పటికీ సారథిగా మాత్రం సెంచరీ ఇప్పటి వరకు చేయలేదు. కాగా మూడు ఫార్మాట్ లో సెంచరీ చేసిన ప్లేయర్లుగా.. తిలకరత్నే దిల్షాన్, డూప్లిసిస్ బాబర్ అజామ్ ఉన్నారు.