మహిళల ప్రీమియర్ లీగ్ ను తలపెట్టిన బీసీసీఐ మొదట ఏ విధంగా జరుగుతుంది అస్సలు సక్సెస్ అవుతుందా అన్న ఆలోచనలో ఉండేవారు. కానీ సీజన్ మొదలైనప్పటి నుండి జరుగుతున్న ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఆసక్తికరంగా మలుపులు తిరుగుతూ అసలైన క్రికెట్ మజాను రుచి చూపించారు. మొత్తం అయిదు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో టైటిల్ ను చేజిక్కించుకునే అవకాశాన్ని దక్కించుకోవాలి అంటే ముందుగా టాప్ 3 కు రీచ్ కావాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ ఆడిన 6 మ్యాచ్ లలో 5 మ్యాచ్ లలో గెలిచి ప్లే ఆఫ్ కు చేరుకుంది. ఆ తర్వాత రెండవ టీం గా ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 6 మ్యాచ్ లలో 4 గెలిచి ప్లే ఆఫ్ కు చేరుకుంది.

ఇక మిగిలింది మూడు జట్లు... ప్లే ఆఫ్ లో ఉన్నది ఒకే ఒక్క స్థానం. కానీ పాయింట్ల పట్టికను బట్టి చూస్తే ప్లే ఆఫ్ కు చేరుకోవడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్న ఏకైక జట్టు యూపీ వారియర్స్. ఎందుకంటే ఈ జట్టుకు మిగిలిన రెండు జట్ల కన్నా విజయాల శాతం మరియు రన్ రేట్ కూడా మెరుగ్గా ఉంది. కాగా ఈ రోజు ఇంకాసేపట్లో గుజరాత్ తో మరో మ్యాచ్ లో తలపడనుంది. ఈ మ్యాచ్ గుజరాత్ కు ఆఖరి లీగ్ మ్యాచ్ కాగా , ఇందులో గెలిచినా ప్లే ఆఫ్ అవకాశాలు లేనట్లే. కానీ ఈ మ్యాచ్ లో గుజరాత్ గెలుపు బెంగుళూరు కు ఏమైనా ఉపయోగాపడుతుందా అన్నది చూడాలి.

మరో వైపు ఈ మ్యాచ్ యూపీ వారియర్స్ కనుక గెలిస్తే స్ట్రెయిట్ గా ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తుంది. ఈ విజయంతో మిగిలిన రెండు జట్లకు నిరాశ తప్పదు. మరి యూపీ వారియర్స్ ను గుజరాత్ జయింట్స్ ఓడించి ప్లే ఆఫ్ ను మరింత ఆసక్తికరంగా మారుస్తుందా చూద్దాం.  




మరింత సమాచారం తెలుసుకోండి: