యావత్ ప్రపంచం కరోనా వైరస్ కు మందు కనుక్కునేందుకు నానా అవస్తలు పడుతోంది. అదే సమయంలో మందులేని వైరస్ విజృంభిస్తున్న కారణంగా ప్రపంచంలో ఇప్పటికి సుమారు 30 లక్షల మంది బాధితులయ్యారు. సుమారు 2 లక్షల మంది కరోనా దెబ్బకు  బలైపోయారు. ఇటువంటి సమయంలో టిడిపి కరోనా వ్యాధి నివారణ మందులు +నిత్యావసర వస్తువుల పంపిణి అంటూ ఓ డ్రామాకు తెరలేపింది.

 

గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ ఫొటోతో పాటు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జి కోవెలమూడి రవీంద్ర ఫొటోలను ముద్రించి ఉన్న బ్యాగులతో ప్రచారం మొదలుపెట్టేశారు. వైరస్ కు మందులంటూ ఏమిస్తున్నారో తెలీదు. నిత్యావసరాలంటూ ఏమి అందిస్తున్నారో తెలీదు.  పార్టీ గుర్తున్న స్టిక్కర్లను ముద్రించి శానిటైజర్లను రెడీ చేశారంటున్నారు. ఎక్కడ, ఎవరికి  పంచుతారో ఏమో ?

 

మొన్నటికి మొన్న రాష్ట్రంలో 2.5 లక్షల మాస్కులు పంపిణి చేసినట్లు చంద్రబాబునాయుడు డప్పు కొట్టుకున్నారు. అన్ని లక్షల మాస్కులను ఏ ఊరిలో పంచారో ఎవరికి పంచారో కూడా ఎవరికీ తెలీదు. 2.5 లక్షల మాస్కులను 13 జిల్లాల్లో పంచితే జిల్లాకు సుమారు 19 వేల మాస్కులు పంచుండాలి. అన్ని వేల మాస్కులు పంపిణి చేసినపుడు మీడియాలో రాకుండానే ఉంటుందా ? 

 

అధికారంలో ఉన్నపుడు హుద్ హుద్, తిత్లీ తుపాను సందర్భంలో కూడా చంద్రబాబు బాగా హడావుడి చేశాడు. అప్పట్లో కూడా  జరగని పనులను జరిగిపోయినట్లు విపరీతమైన ప్రచారం చేసుకున్నాడు. రైతు రుణమాఫీ జరిగిపోయినట్లు, డ్వాక్రా రుణాలను మాఫీ చేసేసినట్లు ఎల్లోమీడియాలో ప్రచారం చేయించుకున్నాడు. ప్రపంచస్ధాయి రాజధానిని అమరావతిలో కట్టేసినట్లు ప్రచారం చేయించుకున్నాడు. తీరా ఎన్నికలు జరిగే సమయానికి తాను చేయించుకున్న ప్రచారమే దెబ్బ కొట్టేసింది. ఎందుకంటే జరిగిందంతా ప్రచారం తప్ప వాస్తవం కాదని బయటపడిపోయింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: