దేవి నవ రాత్రులను హిందువులు ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మ వారిని ఒక్కో రూపంలో అలకరించి ప్రత్యేక పూజలు జరుపుతుంటారు. ఈ మాసంలో శుక్ల పక్షం అష్టమి తిథి రోజున భక్తులు దుర్గాష్టమి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దుర్గాష్టమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం ఆచరించి దుర్గా మాతకు ప్రత్యేక పూజలు జరిపి ప్రార్థిస్తారు. ఈ రోజు వ్రతం కూడా ఆచరిస్తుంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి అమ్మవారిని ఆరాధిస్తూ దేవీ నవరాత్రులు జరుపుకోవడం ప్రారంభిస్తాం. ఒక అప్పటి నుండి సరిగ్గా ఎనిమిదవ రోజున.. అనగా ఆశ్వయుజ అష్టమి దుర్గాష్టమి పర్వదినం నాడు అమ్మవారిని మరింత ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేస్తాం.

ఆ రోజున విద్యార్థులు అంతా తమకు విద్యా ప్రాప్తి కలగాలని అమ్మవారిని కోరుకుంటూ వారి  పుస్తకాలను పూజలో ఉంచి అమ్మ వారిని ప్రార్ధిస్తారు. అలాగే  వృత్తి ఉద్యోగ రంగాలలో కొనసాగేవారు మంచి జరగాలని ఆర్థికంగా స్థిరపడాలని అష్ట పూజలు చేస్తారు. అమ్మవారి పుట్టుక గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. కొందరు కాళీమాత నుదుటి నుండి దుర్గాదేవి ఆవిర్భవించిందని విశ్వసిస్తారు. అందుకే కనకదుర్గమ్మను కాళీమాతగా, రక్తబీజగా, చండీదేవిగా అలంకరణలు చేసి విశిష్ట పూజలు జరిపిస్తారు. దుర్గాష్టమి రోజున 64 యోగినులను, దుర్గాదేవి రూపాలు అయినటువంటి అష్ట నాయికలను అర్చించడం ఆచారంగా వస్తోంది.

దేశంలోని వివిధ ప్రాంతాల్లోనీ హిందువులు  కామేశ్వరి, వైష్ణవి, బ్రాహ్మణి, మహేశ్వరి, చాముండి, వరాహి,
ఇంద్రాణి, నార్సింగి అనే ఎనిమిది మహా శక్తి రూపాలను కొలుస్తుంటారు. తమ పిల్లలను పాఠశాలలో ఇంకా చేర్చని వారు...పిల్లలు చేర్చే వయసు వచ్చి ఉంటే కనుక దుర్గాష్టమి రోజున అక్షరాభ్యాసం చేయడం చాలా మంచిది అని వేదపండితులు చెబుతున్నారు చాలామంది ఈ పద్ధతిని పాటిస్తుంటారు. కొందరు విజయదశమి రోజున చేస్తుంటారు. ఈ ప్రత్యేక  రోజుల్లో పిల్లల  చేత ''ఓంకారం'' రాయించి విద్యాభ్యాసం కనుక  చేయిస్తే వారు మంచి విద్యావంతులుగా ఉన్నత స్థాయిలకు చేరుకుంటారని ఒక విశ్వాసం.

మరింత సమాచారం తెలుసుకోండి: