సాధారణంగా సిని సెలబ్రెటీలతో పోల్చిచూస్తే క్రికెటర్లకు సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే క్రేజ్ ఉంటుంది అనే విషయం తెలిసిందే. అయితే క్రికెటర్లకు సంబంధించి ఏదైనా విషయం తెరమీదికి వచ్చిందంటే చాలు అది హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఒకవేళ క్రికెటర్ ల పర్సనల్ కి సంబంధించిన విషయం అయితే ఇక ప్రేక్షకులందరూ మరింత ఆసక్తి చూపుతూ ఉంటారు అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి ఒక షాకింగ్ నిజం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది  న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డేవిస్ ఇటీవల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక సంచలన ప్రకటన చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు.


 తాను స్వలింగ సంపర్కుడు అన్న విషయాన్ని వెల్లడించాడు. ఈ విషయం ఆక్లాండ్ దేశవాళి క్రికెట్ జట్టు లోని ప్రతి ఒక్కరికి తెలుసు అయినప్పటికీ తన పట్ల మాత్రం ఎలాంటి వివక్ష చూపించలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవలే ఆన్లైన్ మ్యాగజైన్ ది స్పెషల్ ఆఫ్ తో మాట్లాడుతూ నా జీవితంలో నేను ఈ విషయం గురించి దాచిపెడుతున్న భావన నాకు ఉండేది. నిజానికి ఇది నా వ్యక్తిగత విషయం అయినప్పటికీ.. ఎందుకో దాచిపెట్టాలి అనిపించలేదు. బయటి ప్రపంచానికి ఎప్పుడెప్పుడు చెప్పాలా అని ఎదురుచూస్తున్నా. ఆక్లాండ్ జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికి నేను గే అని తెలుసు. అయిన వాళ్ళు దీన్ని పెద్ద సమస్య భావించలేదు. నాకు ఎంతో స్వేచ్ఛ గానే ఉన్నారు. అయితే న్యూజిలాండ్ అంతర్జాతీయ క్రికెటర్లలో గే అని చెప్పుకున్న మొదటి ఆటగాడు ఇతనే కావడం గమనార్హం.

 అయితే ఈ మాజీ క్రికెటర్ చెప్పిన షాకింగ్ నిజం తో ప్రతి ఒక్కరు కూడా అవాక్కయ్యారు అని చెప్పాలి. అయితే న్యూజిలాండ్ లో స్వలింగ సంపర్కం నేరం కాదు అన్న విషయం తెలిసిందే. అక్కడ ఇక స్వలింగసంపర్కులు వివాహం చేసుకోవడానికి చట్టబద్ధత కూడా ఉంది అనే చెప్పాలి. కాగా 1994 ఏప్రిల్లో శ్రీలంక వన్డే మ్యాచ్ తో న్యూజిలాండ్ జట్టు తరఫున అడుగు పెట్టాడు పేసర్ హిత్ డెవిస్  తర్వాత అదే ఏడాది జూన్లో ఇంగ్లండ్తో మ్యాచ్లో టెస్టుల్లో అరంగేట్రం చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Gay