ఇండియా జట్టు ఆస్ట్రేలియా లో మరో మూడు వారాలలో జరగనున్న టీ 20 వరల్డ్ కప్ కోసం సన్నద్ధం అవుతోంది. అందులో భాగంగా సెలెక్ట్ అయిన ఆటగాళ్లను అందరినీ పరీక్షిస్తోంది. అయితే వారిలో చాలా వరకు తమ టాలెంట్ ను నిరూపించుకోగా.. అతికొద్ది మంది మాత్రం సెలెక్టర్ల నమ్మకాన్ని వమ్ము చేసేలా కనిపిస్తున్నారు. ఉదాహరణకు కె ఎల్ రాహుల్, రిషబ్ పంత్, చాహల్, హర్షల్ పటేల్ , భువనేశ్వర్ లు ఇండియా ఫ్యాన్స్ కు షాక్ ఇస్తున్నారు. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ లో ఈ నలుగురు చెప్పుకోదగిన ప్రదర్శనలు చేయకపోవడం విచారించదగ్గ విషయం.

అయితే వీరిలో అందరికీ ప్రత్యమ్నాయాలు లేకపోవడం వలన ఆడించక తప్పదు. కానీ ఒక స్థానానికి మాత్రం జట్టులో తీవ్రమైన పోటీ నెలకొంది. ప్రస్తుతం ఇండియా వికెట్ కీపర్ గా ఉన్న రిషబ్ పంత్ ఆసియా కప్ లో మరియు గడిచిన ఆస్ట్రేలియా సిరీస్ లో సరిగా ప్రదర్శన చేయలేదు. ఈ కారణంగా పంత్ పై విమర్శలు వెల్లువెత్తాయి. తాను బాగా ఆడి మ్యాచ్ లను గెలిపించినపుడు పొగిడిన నోళ్లు, చప్పట్లు కొట్టిన చేతులే ఇప్పుడు వేలెత్తి చూపిస్తూ విమర్శలు చేస్తున్నారు. అయితే వరల్డ్ కప్ కు మరెంతో దూరం లేనందున దొరికిన మంచి అవకాశం సౌత్ ఆఫ్రికా సిరీస్... ఈ సిరీస్ లో మూడు టీ 20 లు మరియు మూడు వన్ డే లు ఆడనున్నారు.

వీటిలో రిషబ్ పంత్ ఎటువంటి తొందరపాటు లేకుండా జాగ్రత్తగా పరుగులు చేస్తే... తన స్థానానికి ఎటువంటి ఢోకా ఉండదు. అలా కాకుండా ఎప్పటిలాగే కీలక సమయంలో అనవసర షాట్ లకు ప్రయత్నించి అవుట్ అయితే మాత్ర్రం... దినేష్ కార్తీక్ ను కీపర్ గా తీసుకుని పంత్ ను బెంచ్ కే పరిమితం చేసే అవకాశాలు లేకపోలేదు. పంత్ కు దొరికిన చివరి అవకాశంగా ఈ సిరీస్ ను పరిగణించవచ్చు. పంత్ విమర్శలను దృష్టిలో పెట్టుకుని తనకున్న బలాన్ని పరుగుల రూపంలో చూపిస్తే అందరి నోళ్లు మూయిస్తాడని ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: