ఎన్నో రోజుల నుంచి క్రికెట్ ప్రేక్షకులందరికీ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతూ వచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా నువ్వా నేనా అన్నట్లుగా సాగగా ఇక ఇప్పుడు నేడు ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో విజయం సాధించి నేరుగా ఫైనల్ లోకి అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో ఓడిపోయి మళ్లీ రెండో క్వాలిఫైయర్ లో విజయం సాధించి కప్పు కోసం విరోచితమైన పోరాటం సాగిస్తున్న గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్లో మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి.


 అయితే గుజరాత్ టైటాన్స్ జట్టు ఆడిన మొదటి సీజన్లోనే టైటిల్ గెలిచిన టీం గా అరుదైన రికార్డు సృష్టించగా.. అటు చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు నాలుగు సార్లుటైటిల్స్ గెలిచి మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ గా కొనసాగుతోంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయం అనేది తెలుస్తుంది. ఇక 2023 ఐపీఎల్ సీజన్ విజేత ఎవరు అనేది కూడా ముందుగా ఊహించలేని విధంగా మారిపోయింది అని చెప్పాలి. అంతేకాదు ఇక ఐపీఎల్ విజేతకు ఇచ్చే ప్రైజ్ మనీ ఎంత అన్న విషయంపై కూడా అందరూ చర్చించుకుంటున్నారు. ఏకంగా ఐపీఎల్ టైటిల్ గెలిచి విన్నర్గా నిలిచిన టీం కి 20 కోట్ల ప్రైస్ మనీ దక్కుతూ ఉంది అని చెప్పాలి. ఇక ఐపీఎల్ ఫైనల్లో ఓడిపోయి రన్నర్ తో సరిపెట్టుకున్న టీం కి 13 కోట్ల రూపాయలు అందుతాయి. అదే సమయంలో క్వాలిఫైయర్ 2 లో ఓడిపోయిన ముంబై ఇండియన్స్ జట్టుకి ఏడు కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కుతుంది అని చెప్పాలి. ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడిపోయి నుంచి నిష్క్రమించిన లక్నో జట్టుకి 6.5 కోట్ల ప్రైస్ మనీ దక్కుతుంది. మరి నేడు జరగబోయే ఐపీఎల్ ఫైనల్ లో మ్యాచ్ విజయం సాధించి 20 కోట్ల ప్రైస్ మనీ అందుకోబోయే టీం ఏదో తెలియాలంటే కాస్త వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl