ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆసియా కప్ విషయంలో గత కొంతకాలం నుంచి సందిగ్ధత నెలకొంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఆసియా కప్ పాకిస్తాన్లో జరగాల్సి ఉంది. కానీ అటు భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతుంది. దీంతో పాకిస్తాన్ లో ఆసియా కప్ నిర్వసిస్తే తాము టోర్ని నుంచి తప్పుకుంటాము అంటూ బీసీసీఐ నిర్మొహమాటంగా చెప్పేసింది. తటస్థ వేదికపై టోర్ని నిర్వహిస్తేనే తాము ఇక లీగ్ లో భాగం అవుతాము అంటూ స్పష్టం చేసింది.


 దీంతో ఆసియా కప్ ను పాకిస్తాన్ లో నిర్వహించాల లేదా మరో వేదికకు మార్చాల అనే విషయంపై గత కొన్ని రోజుల నుంచి ఆసియా క్రికెట్ కౌన్సిల్ చర్చలు జరుపుతూనే ఉంది. ఈ క్రమంలోనే హైబ్రిడ్ విధానాన్ని ప్రతిపాదించింది పాక్ క్రికెట్ బోర్డు.  దీని ప్రకారం ఆసియా కప్ టోర్ని  పాకిస్తాన్లోనే జరుగుతుంది. కానీ భారత్ ఆడబోయే మ్యాచ్లు మాత్రం తటస్థ వేదికపై నిర్వహిస్తారు. పాకిస్తాన్ ప్రతిపాదించిన హైబ్రిడ్ విధానాన్ని శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ వ్యతిరేకించింది. దీంతో ఆసియా కప్ కు దూరంగా ఉండే విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మల్ల గుల్లలు పడుతుంది.


 కాగా ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆసియా కప్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే ఇక ఆసియా కప్ టోర్నని పూర్తిగా పాకిస్తాన్ నుంచి మరో వేదికకు తరలించాలన్న బీసీసీఐ ఆలోచనకే శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్లు మద్దతు తెలిపాయి. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆశలు గల్లంతయ్యాయి అని చెప్పాలి. ఇప్పుడు పాకిస్తాన్ ముందు రెండే దారులు  ఉన్నాయి. తటస్థ వేదికలో ఆడటం లేదంటే టోర్ని నుంచి వైదొలగడం..  ఈ క్రమంలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తటస్థ వేదికపై ఆడేందుకు సిద్ధంగా లేదు అన్నది తెలుస్తుంది. దీంతో ఇక ఆసియా కప్ టోర్నీ నుంచి వైదొలిగే  చాన్స్ ఉంది. ఒకవేళ ఇదే జరిగితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: