ఇటీవల కాలంలో టీమిండియా తరఫున అవకాశం దక్కించుకున్న ఎంతోమంది కుర్రాళ్ళు అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వచ్చిన అవకాశాలను బాగా సద్వినియోగం చేసుకుంటూ.. ఇక తమ సత్తా ఏంటో నిరూపిస్తున్నారు. అంతేకాదు భారత జట్టుకు ఫ్యూచర్ స్టార్ మేమె అన్న విషయాన్ని కూడా అందరికీ అర్థమయ్యేలా చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇలా ఇటీవల కాలంలో టీమ్ ఇండియా తరఫున అదరగొడుతున్న యువ ఆటగాళ్లలో.. యశస్వి జైస్వాల్ రుతురాజ్ లు కూడా ఉన్నారు. వీరిద్దరూ కూడా అంతర్జాతీయ క్రికెట్లో ఆడింది తక్కువ మ్యాచ్లే.


 కానీ ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్ లో మాత్రం ఓపెనర్లుగా బరిలోకి దిగి ఈ ఇద్దరు కూడా విధ్వంసకరమైన ఆటతీరుతో ప్రత్యర్థికి ముచ్చేమటలు పట్టించారు. ఏకంగా సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయి స్కోరు బోర్డును సైతం పరుగులు పెట్టించారు అని చెప్పాలి. దీంతో ఇక ఈ ఓపెనింగ్ జోడి అద్భుతంగా ఉంది అంటూ అటు క్రికెట్ విశ్లేషకులు కూడా ప్రశంసలు కురిపించారు. అయితే ఇక ఇటీవల ఇదే విషయం గురించి భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ప్రస్తుతం టీమిండియా సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే.


 అక్కడ టి20 ఫార్మర్ తో పాటు వన్డే టెస్ట్ ఫార్మాట్ లో కూడా సిరీస్ లు ఆడబోతుంది టీమిండియా. ఈ క్రమంలోనే ఇక మూడు ఫార్మాట్లకు సంబంధించి ప్రత్యేకంగా టీమ్స్ ని ఎంపిక చేసింది బీసీసీఐ. ఈ క్రమంలోనే t20 ఫార్మాట్కు సూర్యకుమార్ వన్డే ఫార్మాట్ కి కేఎల్ రాహుల్ టెస్ట్ ఫార్మాట్ కి రోహిత్ శర్మ సారధ్య బాధ్యతలు చేపట్టపోతున్నారు. అయితే ఇక ఆస్ట్రేలియా తో టి20 సిరీస్ ఓపెనర్లుగా బరిలోకి దిగిన జైష్వాల్, రుతురాజు లను సౌత్ ఆఫ్రికా సిరీస్ లోను ఆడిస్తే బాగుంటుందని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు  మూడు నాలుగు స్థానాల్లో గిల్, సూర్య లోయర్ ఆర్డర్లో తిలక్ వర్మ, రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్ లను ఆడించాలి అంటూ సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: