ఇప్పటి వరకు (ఐపీఎల్) అనేక సీజన్ లు కంప్లీట్ అయ్యాయి. అందులో చాలా సార్లు ఒకే ఇన్నింగ్స్ లో భారీ స్కోరు లు నమోదు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పటి వరకు (ఐపీఎల్) చరిత్రలో టాప్ 7 హైయెస్ట్ స్కోర్ ఇన్నింగ్స్ లు ఏవో..? ఆ మ్యాచులు ఏ సంవత్సరంలో ఎవరి మధ్య జరిగాయి అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ సంవత్సరం ఇప్పటి వరకు (ఐపిఎల్) సీజన్ లో భాగంగా 16 మ్యాచ్ లు కంప్లీట్ అయ్యాయి. అందులో చాలా మ్యాచులలో భారీ స్కోరు లు నమోదు అయ్యాయి. ఇకపోతే 2024 లో సన్రైజర్స్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ జట్టు ముంబై ఇండియన్స్ పై మూడు వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. ఇప్పటి వరకు ఇదే (ఐపీఎల్) హిస్టరీ లో ఇదే హైయెస్ట్ స్కోర్. ఇక నిన్న అనగా 3 ఏప్రిల్ 2024 న కోల్కత్తా మరియు ఢిల్లీ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో మొదటగా బ్యాటింగ్ చేసిన కోల్కతా జట్టు 7 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. ఇకపోతే 2013 వ సంవత్సరం ఆర్సీబీ మరియు PWI మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సిబి జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది. 

ఇక 2023 వ సంవత్సరం LSG మరియు PBKS మధ్య జరిగిన మ్యాచ్ లో LSG టీం ఐదు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. 2016 వ సంవత్సరం ఆర్సీబీ మరియు జిఎల్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఆర్సీబీ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 248 పరుగులను సాధించింది. 2010 వ సంవత్సరం చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ కు మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. 2024 వ సంవత్సరం ముంబై మరియు సన్రైజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl