ఇదిలా ఉంటే మూడు ఫార్మాట్లలో 50కి పైగా యావరేజ్ కలిగిన ఏకైక బ్యాట్స్ మెన్ కూడా కోహ్లీ నే కావడం విశేషం. కోహ్లీ .. టెస్టుల్లో 79 మ్యాచ్ లలో 53. 14 సగటు తో 6749 పరుగులు చేయగా ఇందులో 25 శతకాలు వున్నాయి. వన్డేల్లో అతను 239మ్యాచ్ లలో 60. 31 సగటుతో 11520 పరుగులు చేశాడు. ఇందులో 43సెంచరీలు వున్నాయి. ఇక పైన చెప్పినట్లు టీ 20 ఫార్మాట్ లో 71మ్యాచ్ లలో కోహ్లీ 50.19 సగటుతో 2409 పరుగులు చేశాడు. అలాగే ఈపొట్టి ఫార్మాట్ లో అత్యధిక హాఫ్ సెంచరీలు మరియు అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాట్స్ మెన్ కూడా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. అయితే టీ 20ల్లో ఇంతవరకు కోహ్లీకి శతకం అందని ద్రాక్ష లాగే ఉండిపోయింది. మరి కోహ్లీ త్వరలోనే ఆ ఘనత కూడా సాధిస్తాడో లేదో చూడాలి.