వీరు ముగ్గురు మొదటినుండి ఒకటి గానే ఉంటూ, ఒకటే టీం లో కొనసాగుతున్నారు. వీరు ముగ్గురు మంచి స్నేహితులు. బుల్లితెరపై తన మార్క్ కామెడీ టైమింగ్ ఏర్పాటు చేసుకున్న సుడిగాలి సుదీర్ వెండితెరపై కూడా నవ్వులు పూయించాడు. 4 నెలల క్రితం 3 మంకీస్ అండ్ ఈ ముగ్గురు కలిసి చేసిన ఓ సినిమా ను విడుదల చేసి మోస్తరుగా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే సుడిగాలి సుదీర్ ఇప్పటివరకు కథానాయకుడు గా రెండు సినిమాలను కూడా చేసేసాడు.
ఇక జబర్దస్త్ యాంకర్ రష్మీ, సుడిగాలి సుదీర్ లపై యూట్యూబ్ లో అనేక ఛానల్లో వారి గురించి తెగ రాసేస్తుంటారు. వారు ఇద్దరు కేవలం స్నేహితులు అని ఎన్ని సార్లు చెప్పిన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అంతకుమించి వారిపై ఏవేవో కామెంట్లో పెడుతుంటారు. అంతే కాదు ఏకంగా పెళ్లి చేసుకున్నారు... సంసారం కూడా మొదలు పెట్టారని రాసే వారు కూడా ఉన్నారు. ఇక తాజాగా సుడిగాలి సుదీర్ పలు షోలతో బిజీగా ఉన్నా సరే... ఓ విదేశీ వనిత తో డేటింగ్ చేస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అంతేకాదు వారిద్దరి మధ్య గాఢమైన రిలేషన్ కూడా కొనసాగుతుందని సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయంపై కూడా సుడిగాలి సుదీర్ అలాంటివి ఏమీ లేవని వాటిని కొట్టి పడేశాడు. నేను ఇప్పటికీ సింగిలే అంటూ తెలియజేశాడు. అంతేకాదు హీరో నాగార్జున సినిమాల్లో చెప్పినట్లుగా నేను లవ్ లో పడను, వారిని ప్రేమించేలా చేస్తాను... అదే నా ఫార్ములా అంటూ సుడిగాలి సుదీర్ చెప్పుకొచ్చాడు. తన వ్యక్తిత్వం కేవలం షో డిమాండ్ మేరకు మాత్రమే అలా కనిపిస్తాయని సుధీర్ తెలియజేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి