
ఇక చిన్న వయసులో నుండి హిమ, సౌర్య పెద్దయిన తర్వాత వీరిద్దరి తోనే కథ నడిపిస్తున్నారు. ఇక ఇందులో దీప కార్తీక్ లేకపోవడంతో చాలా మంది ఈ సీరియల్ చూడడానికి ఇష్ట పడడం లేదట. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సీరియల్స్ లో దీప కార్తీక్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ట్లుగా సమాచారం అందుతోంది. కార్తీక,దీప లోయలో పడి ఆ ప్రమాదంలో మరణించలేదని ఆ ప్రమాదం నుంచి బయట పడి వీరిద్దరు తమ మానసిక స్థితిని కోల్పోయి ఉంటారు అన్నట్లుగా సమాచారం.
ఇక వీరిద్దరూ అలా మంగళూరు హాస్పిటల్ చికిత్స తీసుకుంటూ ఉంటారట. దీంతో త్వరలోనే వీరిద్దరూ కలిసి తమ పిల్లలను కలవ పోతున్నట్లుగా తెలుస్తోంది. జ్వాల దగ్గర ఉన్న ఇంద్రుడు, చంద్రమ్మ ఒక పనిమీద తమ సొంత ఊరికి వెళ్లగా అక్కడ దీప కార్తీక్ ని చూడడం జరుగుతుంది. అలా ఇంద్రుడు చంద్రమ్మ వీరిని చూడగానే కథ మొత్తం అడ్డం తిరిగి చివరి వారి సహాయంతో దీప కార్తిక్ తన సొంత ఇంటికి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇలాంటి సమయంలోనే మౌనిత కూడా రీఎంట్రీ ఇవ్వబోతోంది అన్నట్లుగా సమాచారం. డాక్టర్ బాబు కోసం ఆ కుటుంబం లోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది మౌనిక. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది.