ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి, తన కొత్త ఈ-ట్రోన్ జిటి ఎలక్ట్రిక్ కారును ఇండియా మార్కెట్లో విడుదల చేయడానికి తగిన సన్నాహాలని సిద్ధం చేస్తోంది. అయితే ఆడి కంపెనీ ఇటీవల ఈ కొత్త కారు టీజర్ విడుదల చేయడం జరిగింది.ఇక ఆడి కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త ఆడి ఈ-ట్రోన్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకోండి.ఆడి కంపెనీ విడుదల చేయబోతున్న ఈ కారు ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ అయ్యే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఇక రాబోయే ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు బ్రాండ్  మూడవ ఎలక్ట్రిక్ మోడల్. ఇండియా లగ్జరీ మార్కెట్‌లో ఆడి అతిపెద్ద ఈవి పోర్ట్‌ఫోలియోను విస్తరించడం జరుగుతుంది. ఆడి ఈ-ట్రోన్ జిటి ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమవ్వడం జరిగింది. ఇక ఇప్పుడు ఇండియా మార్కెట్లో ఈ కార్ విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ ఆడి ఈ-ట్రోన్ జిటి కారు సిబియు యూనిట్‌గా ఇండియా మార్కెట్‌లోకి రానుంది.

ఇక ఆడి ఈ-ట్రోన్ జిటి రెండు వేరియంట్లలో ఇండియాకి వచ్చే అవకాశం ఉంది. ఈ రకమైన కాన్సెప్ట్ అనేది 2018 లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఆటో షోలో ప్రదర్శించబడింది. ఇక ఈ మోడల్ చాలా ఆకర్షణీయంగా మంచి వైఖరితో ఇండియాలో అరంగేట్రం చేయనుంది. ఇక ఈ కారు చూడటానికి ఎంతో స్టైలిష్ గా ఉంటుంది.ఇక ఈ కొత్త ఆడి ఈ-ట్రోన్ ఎలక్ట్రిక్ కార్ బోనెట్‌పై పెద్ద ఇండెంటేషన్ ఇంకా గ్రిల్‌కు బదులుగా ఇ-ట్రోన్ ప్యానెల్ అనేది ఉంటుంది. అలాగే మ్యాట్రిక్స్ కూపే ఆర్ఎస్ వెర్షన్‌లోని ఎల్ఈడీ హెడ్‌లైట్‌లను ఈ కార్ పొందుతుంది. అయితే ఈ ఆడి కార్ లేజర్ లైట్ రెండు వేరియంట్‌లలో ప్రామాణికమైనదిగా ఉంటుంది. ఆడి ఈ-ట్రోన్ జిటి కార్ లో 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి.ఇక ఇది ఏరో బ్లేడ్‌లతో 21 ఇంచెస్ అల్లాయ్ వీల్ ఎంపికను కూడా కలిగి ఉండటం విశేషం.ఇక ఈ-ట్రోన్ జిటి కారు లోపల ఒక పెద్ద 12.3 ఇంచెస్ వర్చువల్ కాక్‌పిట్ కన్సోల్ ఇంకా 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ప్రామాణికంగా రావడం జరిగింది. ఇక ఈ సిస్టమ్‌లో వాయిస్ కమాండ్ ఇంకా ఆడి కనెక్టివిటీ కూడా ఉన్నాయి. ఇక ఇవి పవర్ ఫుల్ డిసి ఛార్జింగ్ పాయింట్‌లలో తక్కువ స్పీడ్ ఛార్జింగ్ స్టాప్‌లతో వేగవంతమైన మార్గాన్ని లెక్కించడానికి ఇది ఈ-ట్రోన్ రూట్ ప్లానర్‌ని కూడా అందుకోవడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: