స్మార్ట్ ఫోన్లు వాడే వారికి బ్యాటరీ అనేది ప్రధాన సమస్య అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంత గొప్ప బ్యాటరీ అయినా సరే మహా అయితే నాన్‌స్టాప్‌గా వాడితే రెండు రోజుల కంటే ఎక్కువగా ఛార్జింగ్‌ ఇవ్వదు.అయితే అలా కాకుండా ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా 50 ఏళ్లు నాన్‌స్టాప్‌గా పనిచేసే బ్యాటరీ ఉంటే ఎలా ఉంటుంది.? ఊహించుకోవడానికి ఆ ఊహ చాలా అద్భుతంగా ఉంది కదా..ఇక ఇప్పుడు చైనా దేశానికి చెందిన శాస్త్రవేత్తలు దీనిని నిజం చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. చైనా దేశానికి చెందిన బీటావోల్ట్ టెక్నాలజీ అనే కంపెనీ 50 ఏళ్లపాటు పనిచేసే రేడియోన్యూక్లైడ్ బ్యాటరీని అభివృద్ధి చేస్తోంది. ఈ లెక్కన మీరు ఒకవేళ స్మార్ట్‌ ఫోన్‌ ని ఛార్జ్‌ చేస్తే మళ్లీ దాన్ని ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ బీటావోల్ట్‌ టెక్నాలజీ స్మార్ట్‌ ఫోన్స్‌లో ఇమిడే న్యూక్లియర్‌ బ్యాటరీల తయారీపై పనిచేస్తుంది.స్పేస్ లో సూర్యుడి నుంచి దూరంగా ఉండే పరికరాల పనితీరు కోసం ఈ టెక్నాలజీని వాడతారు. అయితే ఈ న్యూక్లియర్‌ బ్యాటరీల తయారీ గతంలో చాలా సార్లు విఫలమయ్యాయి.


ఇందుకు కారణంగా స్మార్ట్‌ఫోన్‌లలో ఇమిడే విధంగా బ్యాటరీలను తయారు చేయలేకపోవడమే. ఇంకా అలాగే.. ప్లూటోనియం వంటి రేడియోధార్మిక పదార్థాన్ని స్మార్ట్‌ఫోన్‌లో వాడటం చాలా ప్రమాదకరం.అందుకే బీటావోల్ట్ టెక్నాలజీ ఈసారి భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. ఇది కృత్రిమ వజ్రం పొరను వాడే రేడియోన్యూక్లైడ్ బ్యాటరీని అభివృద్ధి చేస్తోంది. ఇంకా ఇది సెమీకండక్టర్ లేయర్‌గా పనిచేస్తుంది.మామూలు లిథియం బ్యాటరీలతో పోల్చితే.. న్యూక్లియర్ బ్యాటరీలు ఏకంగా 10 రెట్లు శక్తి కలిగి ఉంటాయి. న్యూక్లియర్‌ బ్యాటరీలు..1 గ్రాము బ్యాటరీలో 3,300 మెగావాట్-గంటలను స్టోర్ చేయగలవు. ఇక ఈ కంపెనీ ఇప్పటికే బీబీ100 అనే వర్కింగ్‌ మోడల్‌ను తీసుకొచ్చింది. ఈ బ్యాటరీ 15 x 15 x 5 mm పరిమాణంలో ఉంది. 100 మైక్రోవాట్ల విద్యుత్‌ను కూడా అందిస్తుంది. మరి నిజంగానే ఈ బ్యాటరీలు అందుబాటులోకి వస్తే టెక్నాలజీ రంగంలో ఇదో నిజంగా మహా అద్భుతం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: