
అలాగే ప్రేమలో మునిగి తేలుతున్న యువతి యువకులు పెట్టుకున్న ముద్దు వేరు. అదే సమయంలో పెద్దవారు ఎంతో ప్రేమగా కొడుకులు కూతుర్లకు ఇచ్చే ముద్దు వేరు. ముద్దు పెట్టే విధానం ఒకటే అయినప్పటికీ అందులో మాత్రం చాలా రకాలే ఉన్నాయి అని చెప్పాలి. అది సరే కానీ ముద్దుపై ఇప్పుడు ఇంతలా చర్చించుకోవడానికి కారణం ఏంటి అని అనుకుంటున్నారు కదా. ఇప్పటివరకు ప్రేమను వ్యక్తపరచడానికి మాత్రమే ముద్దు పనికి వస్తుంది అని అందరూ అనుకున్నారు.
కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ముద్దుతో గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు కూడా సృష్టించవచ్చు అని ఇక్కడ ఒక జంట నిరూపించింది. ప్రపంచంలోనే ఎవరికి సాధ్యం కాని విధంగా ఎక్కువ సేపు ముద్దుపెట్టుకొని రికార్డు సృష్టించారు. ఎక్కువ సేపు అనగానే ఒక గంట లేదా రెండు గంటలు అనుకునేరు. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఏకంగా 58 గంటల పాటు ఏకధాటిగా ముద్దు పెట్టుకుని ప్రపంచ రికార్డు సాధించారు ఇక్కడ ఓ జంట. థాయిలాండ్ లోని పట్టాయాలో ఈ ఘటన చోటుచేసుకుంది. కచయ్, లక్సానా అనే జంట 58 గంటల పాటు ఏకధాటిగా లీఫ్ లాక్ పెట్టుకొని రికార్డు క్రియేట్ చేశారు. ఎన్నో జంటలు ఈ పోటీలో పాల్గొన్న కేవలం ఒక్క జంట మాత్రమే విజేతగా నిలిచింది.