హైదరాబాద్ ఇరానీ చాయ్ ఎంత ఫేమస్సో అందరికి బాగా తెలుసు . కానీ కొత్తగా వచ్చిన ఈ టీ రుచి చుస్తే మైమరచిపోతారు. ఈ చాయ్ రుచి అమోగంగా ఉంటుంది. ఆరోగ్యం పరంగా ఎన్నో ప్రయోజనాలు ఉండడంతో ఈ చాయ్ కి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ చాయ్ పేరు మైజాన్ టీ . ఈ మైజాన్ టీ ని పాలుకలపకుండా కేవలం డికాషన్ రూపంలో తీసుకుంటారు. ఇందుకు కేవలం నాలుగు గ్రాముల టీ ఆకులను మాత్రమే వాడుతారు. ఇందులో పాలు కలుపక పోయినప్పటికీ ఈ చాయ్ అద్భుతమైన రుచిని అందిస్తుంది. హైదరాబాద్ లో ని నిలోఫర్ కేఫ్ లో ఈ చాయ్ ని ప్రత్యేకంగా తయారుచేస్తారు. ఈ చాయ్ ధర అక్షరాలా 1000 రూ.. హైదరాబాద్ లో ఇరానీ చాయ్ 10 రూ. లనుండి మహా అయితే 100 రూ ఉంటుంది ఏంటి ఈ చాయ్ కి ఇంత ధర ఎందుకు అనుకుంటున్నారా .


.ఈ టీ ఆకుల ప్రత్యేకత ఏంటో తెలుసుసుకోవాలి అస్సోం  రాష్ట్రం లోని బ్రహ్మపుత్ర నదీ తీర ప్రాంతం చుట్టూ ఉన్న  మైజాన్‌ టీ తోటల్లో మాత్రమే ఈ టీ ఆకులూ లభిస్తాయి .ఈ గోల్డెన్ టిప్స్ బ్లాక్ టి అని పిలువబడే ఈ పంట ఏడాదికి ఒక్కసారి మాత్రమే తన మొగ్గలను ఇస్తుంది. వీటిని ప్రత్యేకంగా సూర్యోదయానికి ముందే కట్ చేసి ఆరబెట్టి పొడి చేసి ప్యాక్ చేస్తారు. అయితే ఈ టీ కేవలం కిలొనుండి కిలోన్నర మాత్రమే ఒక్కసారికి లభిస్తుంది . ఈ కారణంగా ఈ పొడికి అధిక డిమాండ్ ఏర్పడింది. అందుకే వ్యాపార సంస్థలు దీనికి ఎంత ఖర్చైనా పెట్టి కొనుక్కోవాలని పోటీపడుతున్నారు. ఇదంతా సులువు గా దొరకదంటే అతిశయోక్తి కాదేమో.


హైదరాబాద్ నిలోఫర్ కేఫ్ యజమాని  బాబురావు ఈ టీ పొడిని రూ.75 వేలు ఖర్చు చేసి  కేవలం కిలోమాత్రమే వేలంపాటలో దక్కించుకున్నాడు. అందుకే ఈ చాయ్ ధరను వెయ్యి రూపాయలు గా నిర్ణయించినట్లు చెప్పాడు . ఈ ధర ఎక్కువ అయినప్పటికీ చాలామంది ఈ టీ ని తాగేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హైదరాబాద్ నిలోఫర్ హాస్పిటల్ సమీపంలో ఉన్న కేఫ్ లో ఈ టీ లభిస్తుంది.నిలోఫర్ హాస్పిటల్కి దగ్గరగా ఉన్నందున ఈ కేఫ్ కి నిలోఫర్ కేఫ్ అని పేరు వచ్చింది. ఇంత ఖర్చుపెట్టి ఈ టీని తాగటానికి కొన్ని ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు లేకపోలేదు. ప్రత్యేకంగా బరువు తగ్గాలనుకునేవాళ్ళు ఈ చాయ్ ని తీసుకోవడం ద్వారా అధిక బరువును తగ్గించుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: