అసలు కొందరు ఎలాంటి అవగాహన లేకండా ప్రమాదకర విన్యాసాలు చేస్తూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. బైక్‌పై విన్యాసాలు చేస్తూ కొందరు, మరికొందరు వివిధ రకాల వస్తువులతో ప్రమాదకర ప్రయోగాలు చేస్తూ చివరకు ప్రమాదంలో పడుతుంటారు.ఇలాంటి ప్రమాదకర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ బాలుడు స్టేజిపై చేతికి నిప్పు వెలిగించుకుని డేంజరస్ స్టంట్ చేస్తుండగా చివరకు షాకింగ్ ఘటన అక్కడ జరిగింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతూ షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. తమిళనాడు చెన్నైలోని నీలంకరైలో జూన్ 22 వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. తమిళ నటుడు, రాజకీయవేత విజయ్ పుట్టిన రోజు సందర్భంగా స్థానికంగా ఉన్న అభిమానులు వేడుకలని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ 11 ఏళ్ల ఓ బాలుడు విన్యాసాలు చేసేందుకు వేదిక మీదకు వచ్చాడు. 


మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు చేస్తున్న ఆ బాలుడు చేతిపై మంట వెలిగించుకుని, ఇటుకలను పగులగొట్టే విన్యాసం చేసేందుకు సిద్ధమయ్యాడు.ఎదురుగా మూడు ఇటుకలను ఒకదాని మీద మరొకటి పేర్చి...తన చేతిపై పెట్రోల్ పోసుకుని మంట వెలిగించాడు.ఆ మంటలు అంటుకున్న చేత్తోనే ఇటుకలను పగులగొట్టేందుకు సిద్ధమయ్యాడు. అనుకున్నట్లుగానే ఇటుకలను ఒకేసారి  పగులగొట్టాడు. అయితే తర్వాత చేతిపై ఉన్న  మంటలు ఇంకా పెద్దగా అయ్యాయి. దీంతో బాగా భయపడిన బాలుడు.. వాటిని ఆర్పే క్రమంలో భయంతో అటూ ఇటూ పరుగెత్తాడు. పక్కనే పెట్రోల్ బాటిల్ పట్టుకుని ఉన్న వ్యక్తి బాలుడికి అంటుకున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నించే  క్రమంలో అతడి చేతిలోని పెట్రోల్ మీద పడి మంటలు మరింత పెద్దగా మారతాయి.ఈ క్రమంలో ఆ బాలుడు నొప్పితో బాగా విలవిల్లాడిపోతాడు. చివరకు అంతా చుట్టూ చేరి ఎలాగోలా ఆ మంటలను ఆర్పేసి, అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తారు. ఈ ప్రమాదంలో బాలుడికి చాలా గాయాలైనట్లు తెలిసింది. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: